సాధరణంగా ఏదైనా గ్రహం ఒక రాశి నుండి మరో రాశికి మారడాన్ని సంచారం అంటారు. జూన్లో 5 పెద్ద గ్రహాలు రాశిచక్రాన్ని మార్చబోతున్నాయి. దీనిలో కుజ గ్రహం కూడా ఒకటి. జూన్ 27న ఉదయం 5:39 గంటలకు కుజుడు.. ప్రస్తుతం ఉన్న మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కారణంతో కొన్ని రాశుల వారికి ఈ అంగారక సంచారం శుభఫలితాలను ఇస్తుంది.
మిథునం (Gemini): అంగారక సంచారం శుభ ఫలితాలను అందుకునే రాశుల్లో మిథునం ప్రధానమైంది. ఈ ప్రభావంతో ఈ సారి వారు ఏ పని చేసినా సక్సెస్ అందుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులకు చాలా అనుకూలమైన సమయం ఉంది. పని ఏదైనా.. ఆయా రంగాల్లో వీరికి ఆకస్మిక ధన లాభం ఉండే అవాకశం ఉంది. అయితే ఈ కాలంలో ఎలాంటి లోన్ తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే కెరీర్ లో మంచి ఫలితలు కనిపిస్తున్నాయి.
సింహ రాశి (Leo): జూన్ నెల చివరిలో సింహ రాశి వారికి అదృష్టం తోడ్పాటునందిస్తుంది. కుటుంబ జీవితంలో సమతుల్యత పెరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చాలా మేలు చేస్తాయి. ఆస్తి విషయాలలో ఊహించని ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారులకు చాలా అనుకూలమైన కాలం ఇది. ఒకటి కంటే ఎక్కువ పనులను చేతిలోకి తీసుకుంటే సమస్యలు ఏర్పడతాయి. అంగారక సంచారంతో ఇంట్లో అంతా అంగారకుడిదే అవుతుంది.
మకరం (Capicron): కుజుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా మకర రాశి వారి జీవితం పూర్తిగా మారనుంది. ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. రవాణా సమయంలో ఆస్తి లాభదాయకంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగులకు మాత్రం.. కార్యాలయంలో అద్భుతమైన ఫలితాలను సూచిస్తోంది.
మీనం (Pisces): మీన రాశి వారిపై అంగారక సంచారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. డబ్బు అందుకోవచ్చు. గతానికి భిన్నంగా ఈ రాశి వారికి అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది. ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తే కచ్చితంగా దాన్ని పూర్తి చేసి తీరుతారు. అయితే కళ్ళు లేదా దంతాలకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు, కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి చాలా అనుకూల సమయం.