డిసెంబర్ 03, 2022న బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు భద్రరాజ యోగం ఏర్పడుతుంది. భోపాల్ ఆధారిత జ్యోతిష్కుడు మరియు వాస్తు కన్సల్టెంట్ పండిట్ హితేంద్ర కుమార్ శర్మ నుంచి బుధుడి సంచారంతో ఏర్పడే ఈ భద్రరాజ్ యోగం నుంచి ఎవరు ప్రయోజనం పొందుతారో ఓ లుక్కేద్దాం.
మేష రాశి : భద్రరాజ యోగం ఏర్పడటం వల్ల మేష రాశి వారికి అదృష్టానికి విపరీతమైన మద్దతు లభిస్తుంది. డిసెంబర్ నెలలో ఈ శుభ యోగ ప్రభావం వల్ల మేష రాశి వారికి ధనప్రాప్తి కలుగుతుంది. అదృష్టం వారి పని రంగంలో ముందుకు సాగడానికి అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. తండ్రి మరియు పితృ సంపదల నుండి లాభం కూడా ఉంది. మీరు ఈ నెలలో ముందుగా చేసిన పనుల ప్రయోజనాలను కూడా చూడవచ్చు
మిథునరాశి : ధనుస్సు రాశిలో బుధుడు సంచరించడం వల్ల మిథున రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మిథునరాశి వారు ఈ కాలంలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధంలో ప్రతికూలత తొలగిపోయి ప్రేమబంధం బలపడుతుంది. అలాగే.. భద్రరాజ యోగం వల్ల ఆర్ధిక సమస్యలు తొలగిపోయి.. ఊహించనంత ధన లాభం చేకూరే అవకాశం కన్పిస్తుంది. మీకు విహహయోగం ఉంది, కొన్ని మంచి వివాహ ప్రతిపాదనలు అందుకుంటారు. అలాగే.. నిరుద్యోగులకు ఇది మంచి కాలం. ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశం ఉంది.
వృషభ రాశి : బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి కూడా ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారు వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. సంతానం కోసం నిరాశ ఉంటే, ఆ వైపు నుంచి కొన్ని శుభవార్తలు ఉండవచ్చు. భద్రరాజ యోగం వల్ల ఆర్ధిక సమస్యలు తొలగిపోయి.. ఊహించనంత ధన లాభం చేకూరే అవకాశం కన్పిస్తుంది.
సింహ రాశి : ఇది సింహ రాశి వారికి చాలా శుభం మరియు ఫలదాయకం. ఈ శుక్రుని సంచారంతో సింహ రాశి వారికి తమ సత్తా చూపే అవకాశం లభిస్తుంది. వారి సమర్థత కారణంగా, వారు తమ పని రంగంలో ప్రయోజనాలను పొందవచ్చు. హోటల్, టూరిజం, అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్ మరియు స్పోర్ట్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు, ఈ ప్రయాణం శుభప్రదంగా మరియు పని పరంగా ఫలవంతంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది, ఆదాయం పెరుగుతుంది.
మీనం : ధనుస్సు రాశిలో బుధుడు ప్రవేశించడం మీన రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి వారు అనుకోకుండా విదేశాలకు వెళ్లవచ్చు. వ్యాపార వర్గాలు లాభిస్తాయి. ఉద్యోగులు పని రంగంలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ప్రేమ సంబంధంలో ప్రతికూలత తొలగిపోయి ప్రేమబంధం బలపడుతుంది. ఊహించనంత ధన లాభం ఉంటుంది.