జ్యోతిష్యం ప్రకారం వాస్తుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం దిశ బాగుంటే దశ తిరుగుతుందన్న నానుడి ఎప్పటి నుంచో ఉంది. దీన్ని బట్టి వాస్తుకు ఉన్న విలువను అర్థం చేసుకోవచ్చు. వాస్తు సాధారణంగా ప్రకృతిలోని ఐదు అంశాలను ప్రభావితం చేస్తుందంటారు. మనిషి జీవితంలో శ్రేయస్సు, వృద్ధి, సంతోషాన్ని కలిగించే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి, అందుకు తగ్గట్టు ఇంటి పరిసరాలను ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు మార్గదర్శిలా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఓపెన్ షూ స్టాండ్ ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తులను మాత్రమే ఆకర్షిస్తుంది. ఫలితంగా ఇంట్లో సామరస్యం దెబ్బతినే అవకాశం ఉంది. పశ్చిమ లేదా నైరుతి మూలలు, షూ రాక్ ఉంచడానికి అనువైన దిశలు. ఉత్తరం, ఆగ్నేయం, తూర్పు దిశల్లో సైతం ఉంచకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఉత్తరం, తూర్పు దిశలో తలుపులు, కిటికీలు.. దక్షిణ, పడమర దిశల కంటే పెద్దవిగా ఉండాలి. అలాగే నైరుతి దిశలో కిటికీలను ఏర్పాటును విరమించుకోండి. ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకూడదు. భూమిపై అయస్కాంత క్షేత్రం మూలం కూడా ఈ దిశ వైపు ఉంటుంది. దీంతో నిద్రలేని రాత్రులు, రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
దక్షిణ, పడమర గోడలకు ఆనుకోని భారీ ఫర్నిచర్ ఉంచండి. తేలికపాటి ఫర్నిచర్‌ను ఉత్తర, తూర్పు గోడలకు పక్కనే ఉంచుకోండి. గోడ గడియారాలు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండాలి. వీటిని ఇంటికి తూర్పు, పడమర, ఉత్తరం వైపు గోడలకు అమర్చుకోవాలి. గోడ గడియారాన్ని ఈ దిశలో ఉంచడం వల్ల కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంటి మెయిన్ గేట్ ఎల్లప్పుడూ మిగిలిన తలుపుల కంటే చాలా పెద్దదిగా ఉండాలి. ఇది పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కుల్లో చెక్కతో తయారు చేసిన గేట్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇంటి నేమ్‌ప్లేట్ చూడడానికి చక్కగా, శుభ్రంగా ఉండాలి. మెరిసే నేమ్‌ప్లేట్ అవకాశాలను ఆకర్షిస్తుంది. ఇది ఇంట్లో నివసించే వ్యక్తి జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈశాన్యం సానుకూల శక్తులకు మూలం. కాబట్టి అది బహిరంగంగా, తేలికగా, చక్కగా ఉండాలి. దీనికి మరో ఉత్తమ పరిష్కారం ఉంది. దక్షిణ -పశ్చిమ గోడలను, ఉత్తర- తూర్పు గోడల కంటే ఎత్తుగాను, మందంగాను నిర్మించుకోవాలి. నైరుతి దిశ భారీ వస్తువులను ఉంచుకోవాలి. శుభం కోసం ఇంటి మధ్యలో స్తంభం, మెట్లు లేదా ఇతర భారీ వస్తువులను ఏర్పాటు చేసుకోకూడదు. ఒక వేళ అలా ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)