Vastu Tips : మీ ఇంట్లో సమస్యలకు పరిష్కారం చూపించమని కోరుతూ మీరు ఎవరైనా వాస్తు నిపుణుడి దగ్గరకు వెళ్తే.. వారు మీ ఇంటిని చూసేందుకు వస్తారు. ఐతే.. వారు డైరెక్టుగా ఇంట్లోకి రారు. ముందుగా ఆ వీధి, రోడ్డు, చెట్లు, వీధి దీపాలను గమనిస్తారు. తర్వాత ఇంటి గేటును చూస్తారు. గేటు దాటాక.. పెరట్లో ఏయే మొక్కలున్నాయో చూస్తారు. తర్వాత ఇంటి మెయిన్ డోర్‌ని చూస్తారు. అంతే.. దోషం ఏంటో ఇట్టే చెప్పేస్తారు. ఇవన్నీ చూసేటప్పటికే వారికి విషయం అర్థమైపోతుంది.
స్వస్తిక్ : వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి మెయిన్ డోర్‌పై స్వస్తిక్ ముద్రను వేసుకోవాలి. ఇది ఎంతో శుభప్రదం. ఈ స్వస్తిక్ ముద్రను కొద్దిగా నీరు కలిపిన పసుపుతో వేసి.. మధ్యలో, చివర్లలో కుంకుమతో బొట్లు పెట్టాలని సూచిస్తున్నారు. ఈ ముద్ర చెడును తొలగించి.. ఇంటికి శుభవార్తలు వచ్చేలా చేస్తుందని చెబుతున్నారు.