VASTU TIPS IN TELUGU IF YOU KEEP SNAKE PLANT IN YOUR HOME YOU WILL GET THESE AMAZING POSITIVE BENEFITS SK
Vastu Tips: ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు..మీ ఆదాయం రెట్టింపవుతుంది.. ఏ కష్టమూ రాదు
Vastu Benefits: మనం మొక్కలను పచ్చదనం కోసం, మనసుకు ఆహ్లాదం కోసం పెంచుకుంటాం. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం.. కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే.. ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాంటి ఓ మొక్క గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గ్రామాల్లో ఇంటి చుట్టూ మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. కానీ హైదరాబాద్ వంటి మహా నగరాల్లో చెట్లు తక్కువగా కనిపిస్తాయి. అందుకే చాలా మంది ఇండోర్ మొక్కలను పెంచుకుంటారు. ఇండోర్ మొక్కలు ఇంట్లో తాజా దనాన్ని, సానుకూల శక్తిని ఇస్తాయి.
2/ 8
వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలను శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ మొక్కలు జీవితంలో సానుకూల ప్రయోజనాలను తెస్తాయి. నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి.. ఆర్థిక, అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. స్నేక్ ప్లాంట్ కూడా అలాంటిదే. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఏ కష్టమూ రాదు.
3/ 8
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంటే మేలు జరుగుతుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఇంట్లో సంతోషం ఉంటుంది.
4/ 8
మీ ఎదుగుదలలో ఏవైనా అడ్డంకులు ఉంటే.. అలాంటి అవరోధాలను తొలగించే శక్తి స్నేక్ ప్లాంట్‌కు ఉందట. తద్వారా ఉద్యోగ, వ్యాపారాల్లో విజయానికి దోహదం చేస్తుందట. ఆదాయం రెట్టింపవుతుంది.
5/ 8
స్నేక్ ప్లాంట్ సహజసిద్ధంగానే గాలిని శుభ్రం చేసే మొక్క. ఇది గాలిని శుద్ధి చేసి.. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఇంట్లో స్నేక్ ప్లాంట్‌ను పెట్టుకుంటే మనసుకు మంచి అనుభూతి కలుగుతుంది.
6/ 8
ఆఫీస్ టేబుల్ మీద స్నేక్ ప్లాంట్ పెట్టాలి. ఇది మంచి అనుభూతిని ఇస్తుంది. తద్వారా పని సామర్థ్యాన్ని పెంచుతుంది. దీన్ని స్టడీ టేబుల్‌పై ఉంచడం కూడా మంచిదని చాలా మంది భావిస్తారు. ఇది పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది.
7/ 8
స్నేక్ ప్లాంట్‌ని ఇంటి లోపల ఆగ్నేయ మూల, తూర్పు, దక్షిణ దిశలో ఉంచడం శ్రేయస్కరం. ఇతర మొక్కలతో పాటు ఈ మొక్కను ఉంచకూడదు. ఇంట్లోకి వచ్చే వారికి కనిపించేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే ఆ మొక్క వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి.
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)