Vastu Tips: మీ ఇంటిపై చెడు ప్రభావం.. తులసి మొక్క నుంచి ముందే సంకేతం.. ఇలా తెలుసుకోండి
Vastu Tips: మీ ఇంటిపై చెడు ప్రభావం.. తులసి మొక్క నుంచి ముందే సంకేతం.. ఇలా తెలుసుకోండి
Vastu Tips: ఇంట్లో తులసి మొక్కకు ప్రతిరోజూ పూజ చేయడం చాలా మందికి అలవాటు. అలా చేస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఐతే కొన్ని సార్లు తులసి మొక్కలో ఊహించని మార్పులు జరుగుతాయి. అలాంటప్పుడు ఆ ఇంట్లో ఏదో చెడు జరుగుతుందట. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
హిందూమతంలో, తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల మనిషికి ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయి. అలాగే మరణానంతరం మోక్షం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
హిందూమతంలో తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల సంపద లభిస్తుందని నమ్ముతారు. అలాగే మరణానంతరం మోక్షం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అనేక రకాల అనారోగ్య సమస్యలు తులసితో తగ్గుతాయి. అంతేకాదు వాస్తు శాస్త్రంలో కూడా తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాబోయే సంఘటనలకు సంబంధించి.. తులసి మొక్క ముందే సూచనలను ఇస్తుందని విశ్వసిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
చలికాలంలో తులసి మొక్క చాలాసార్లు ఎండిపోవడం తరచుగా కనిపిస్తుంది. ఇవి సాధారణ విషయమే. కానీ ఆకుపచ్చగా కళకళలాడుతున్న తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే.. అది భవిష్యత్తులో ఇబ్బందులు రాబోతున్నాయని అర్ధం చేసుకోవాలట. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
పితృ దోషం వల్ల కూడా చాలా సార్లు తులసి మొక్క ఎండిపోతుంది. ఒక వ్యక్తి పిత్ర దోషంతో బాధపడుతున్నప్పుడు.. తులసి మొక్క పదే పదే ఎండిపోతుంది. ఇది మీకు కూడా జరిగితే... దానికి వెంటనే తగిన పరిష్కారాన్ని వెతకాలి. పండితులను సంప్రదించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
మీ ఇంట్లో తులసి మొక్క చుట్టూ పావురం లేదా ఇతర పక్షులేవైనా గూడు కట్టుకుంటే అశుభంగా భావించాలి. జాతకంలో కేతువు స్థానం క్షీణించినట్లు అర్థం చేసుకోవాలి. ఇలా జరిగితే ఆ ఇంట్లో ఇబ్బందులు వస్తాయట. ఫ్యామిలీలో గొడవలు జరుగుతాటయ. అశాంతి నెలకొంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తులసి మొక్క బుధ గ్రహానికి సంబంధించినది. తులసిని ఇంటి డాబాపై ఉంచడం వల్ల బుధుడు బలహీనపడతాడని వాస్తు పండితులు చెబుతున్నారు. బుధ గ్రహం సంపద, వ్యాపారానికి అధిపతిగా పరిగణిస్తారు. అందువల్ల బుధుడు బలహీనపడితే.. మీ ఆర్థిక పరిస్థితి కూడా క్షీణిస్తుందట. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) ప్రతీకాత్మక చిత్రం