Vastu Tips : పెళ్లి సంబంధం కుదరాలా.. ఇంట్లో ఈ పూలను ఉంచండి
Vastu Tips : పెళ్లి సంబంధం కుదరాలా.. ఇంట్లో ఈ పూలను ఉంచండి
Vastu Tips : ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు అంటారు కదా.. ఎందుకంటే.. రెండూ కష్టమే. ఇల్లంటే.. కనీసం అద్దె ఇంట్లో గడపొచ్చు. పెళ్లికి ప్రత్యామ్నాయం ఉండదు కదా. కాబట్టి కచ్చితంగా పెళ్లి అయ్యి తీరాలి. అందుకు సమస్యలు ఎదురవుతూ ఉంటే.. ఈ పూలను ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో యంగ్ జనరేషన్ త్వరగా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపట్లేదు. ముందు కెరీర్లో సెటిల్ అవ్వాలి అంటున్నారు. దాంతో వాళ్లకు పెళ్లి చేసి.. ఓ బాధ్యత తీర్చుకుందాం అనుకునే తల్లిదండ్రులకు ఆ కల త్వరగా నెరవేరట్లేదు. ఏళ్ల తరబడి వాయిదా పడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
కొన్నిసార్లు పెళ్లికి సిద్ధమైనా.. రకరకాల కారణాల వల్ల అది వాయిదా పడుతూ ఉంటుంది. అంతా సవ్యంగానే ఉన్నా.. భాగస్వామి సెలెక్షన్ లేట్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెళ్లికి తగిన ముహూర్తం సెట్ కాదు. ఇలా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఈ సమస్యలన్నింటికీ మనం నివసించే ఇంటికి ఉన్న వాస్తు దోషమే కారణమని చెబుతున్నారు నిపుణులు. వాస్తు శాస్త్రంలో ఈ సమస్యలకు పరిష్కారం ఉందని అంటున్నారు. వాస్తు శాస్త్రంలో ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఓ పూల మొక్క సమాధానంగా కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
ప్యూనీ పూల (Peony flowers)ను వాస్తు శాస్త్రంలో అందం, రొమాన్స్‌కి గుర్తుగా భావిస్తారు. ఈ పూలను పూలలో రాణిగా చెబుతారు. అంత అందంగా ఉంటాయి ఇవి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
ప్యూనీ పూల మొక్కను నర్సరీలో గానీ లేదా.. ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో కొని.. ఇంటి పెరట్లో పాతితే.. దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎనర్జీ.. పెళ్లికి ఎదురవుతున్న ఆటంకాల్ని తరిమేస్తుందని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
ఎవరి ఇళ్లలోనైతే పెళ్లి సంబంధాలు కుదరట్లేదో, ఏ ఇళ్లలో అయితే.. పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టగానే సమస్యలు ఎదురవుతున్నాయో.. ఆ ఇళ్లలో వారు.. ప్యూనీ పూలను ఇంట్లో ఉంచాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ఈ పూలను ఇళ్లలోపల ఎక్కడ ఉంచాలనే డౌట్ మనకు ఉంటుంది. వాస్తు ప్రకారం.. ఇంట్లోని నైరుతీ దిశలో ఉంచాలి. ఐతే.. ఈ పూలు మార్కెట్లలో దొరకడం కష్టం. అందువల్ల ఈ పూల ఫొటో లేదా పెయింటింగ్‌ని కూడా నైరుతీ దిశలో ఉంచవచ్చని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
వాస్తు శాస్త్రం ప్రకారం ప్యూనీ పూల మొక్కలను పెరట్లో పాతేటప్పుడు.. ఎంట్రన్స్కి కుడివైపున పాతాలి. తద్వారా మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.