Vastu Tips: మీ పేదరికానికి ఈ మొక్కలు కారణం కావచ్చు.. ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి
Vastu Tips: మీ పేదరికానికి ఈ మొక్కలు కారణం కావచ్చు.. ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి
Vastu Tips: మీ ఇంట్లో ఆర్థిక సమస్యలున్నాయా? ఎంత సంపాదించినా నెల తిరిగే సరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదా? ఐతే అందుకు వాస్తు ప్రకారం..కొన్ని మొక్కలు కూడా కారణం కావచ్చు. ఆ మొక్కలుంటే వెంటనే తొలగించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మందికి ఇళల్లో మొక్కలు పెంచుకోవడం అలవాటు. పూల మొక్కలతో పాటు అందమైన బొన్సాయి మొక్కలను కుండీల్లో పెంచుతుంటారు. అవి మనసకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మనలో మానసిక ప్రశాంతతను పెంచుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
కొందరు మనీ ప్లాంట్ మొక్కను ఇంటి గుమ్మం ముందు ఉంచుతారు. ఇది బాగా పెరిగితే.. ఆ ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదని..ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఒకవేళ అది ఎండిపోతే మాత్రం ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు వస్తాయని విశ్వసిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఐతే వాస్తు ప్రకారం.. ఇంట్లో అస్సలు పెట్టకూడదని కొన్ని మొక్కలు ఉన్నాయి. అవి ఇంట్లో ఉంటే చేతిలో డబ్బు నిలవదు. సుఖ సంతోషాలు ఉండవు. అందువల్ల అలాంటి మొక్కలు మీ ఇంట్లో తొలగించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఇంటి పరిసరాల్లో గోరింటాకు, చింత చెట్టు ఉండకూడదట. అలాగే తుమ్మ, రేగు వంటి ముళ్ల మొక్కలను నాటకూడదు. ఇంట్లో పత్తి, నిమ్మకాయల చెట్లు ఉన్నా.. అక్కడ ప్రతికూల శక్తి ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో మానసిక ఒత్తిడి పాటు ఆర్థిక సమస్యలు వస్తాయట. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
కొంతమంది తమ ఇళ్లల్లో కాక్టస్, మిరప మొక్కలను కూడా ఇష్టంగా పెంచుకుంటారు. ఇవి చూసేందుకు అందంగా..మనసుకు ఆహ్లాదంగా అనిపించవచ్చు. కానీ ఇంట్లో ఇలాంటి మొక్కలను ఉంచుకోవడం మంచిది కాదట. నెగెటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఇబ్బందులు వస్తాయట. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)