Tulasi Tips: ఇంట్లో తులసి మొక్క ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే అంతే..!
Tulasi Tips: ఇంట్లో తులసి మొక్క ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే అంతే..!
Vastu Tips: హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి రోజూ తులసిని పూజిస్తారు. ఐతే వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో తులసి మొక్క ఉంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయట.
హిందూ మతంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే చాలా మంది హిందువుల ఇళ్లల్లో తులసి కోటలు ఉంటాయి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి..స్నానం చేసి.. తులసి మొక్కను పూజిస్తారు( ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
ఇంట్లో నాటిన తులసి మొక్క సానుకూల శక్తిని పెంచుతుంది. దీని కారణంగా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపదతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ఆయుర్వేదంలో మంచి ఔషధంగా తులసికి పేరుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
వాస్తుశాస్త్రం ప్రకారం.. తులసి విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే విష్ణువు ఆరాధన సమయంలో తప్పనసిరిగా తులసి ఆకులను వినియోగించాలి. ఇలా చేస్తే శ్రీహరి విశేష ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
హునుమంతుడిని పూజించే సమయంలోనూ నైవేద్యంగా తులసిని సమర్పించాలి. తద్వారా ఆంజనేయుడి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. ధనలాభాన్ని పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి, తులసి మొక్కను ఆగ్నేయ దిశ నుంచి వాయువ్య దిశ వరకు ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
కొన్నికొన్ని సార్లు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా... తులసి మొక్క వాడిపోతుంది. ఎండిపోతుంది. ఇలా జరిగితే మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడినట్లుగా భావించాలి. కుటుంబంలో పెద్ద సంక్షోభం రాబోతున్నట్లుగా అర్ధం చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
తులసిని ఎప్పుడూ భూమిలో నాటకూడదని వాస్తు నిపుణులు చెబుతారు. అలా చేస్తే ప్రతికూల శక్తి పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ ఒక కుండీలో తులసి మొక్కను నాటాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)