రెంట్ కోసం ఇల్లు వెతికే క్రమంలో మీరు అద్దెకు ఉండాల్సిన ఇంటిని గతం కూడా ఒకసారి తెలుసుకోవాలి. గతంలో ఆ ఇంట్లో జరిగిన సంఘటలను తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకరం. ఇంట్లో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తెలుసుకోవడం అవసరం. అందులో ఏదైనా చెడు జరిగినా, దురదృష్టం చోటు చేసుకున్నవి అంటే అలాంటివి ఒదిలేయడం మంచిది. లేకపోతే.. గణపతి హోమం వంటి వాస్తు శాంతిని చేసుకుంటే బెటర్‌గా ఉండొచ్చు. ముఖ్యంగా వంట, పూజా గదులు దక్షిణం వైపు లేకుండా చూసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ముఖ్యంగా శ్శశాన వాటికలకు దగ్గరా.. ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ దగ్గర దేవాలయాల దగ్గర జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల దగ్గర ఇల్లుకు అద్దెకు తీసుకోవడం వల్ల మనశ్శాంతి ఉండదు. ఎపుడు ఏదో డిస్టబెన్స్ ఉంటుంది. పట్టణాలు, నగారాల్లో ప్రశాంతంగా జీవించడానకీ ఆస్కారం ఉండటం కష్టం. మీరు అద్దెకు తీసుకున్న ఫ్లాటు చుట్టు పక్కల ప్రశాంతమైన, అనుకూలమైన వాతావరణం ఉండే ఇళ్లును తీసుకుంటే బెటర్. (ప్రతీకాత్మక చిత్రం)
మీ ఇంటి సమీపంలో మొబైల్ టవర్ లేదా విద్యుత్ స్థంబాలు ఉన్న ఇంటిని తీసుకోకుండా ఉండటం మిక్కిలి శ్రేష్ఠం. మీరు తప్పని సరిగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడితే.. అందులో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి యాగం, గణేష్ పూజ, నవగ్రహ పూజ మొదలైనవి చేసి ప్రతికూల శక్తులను అదుపులోకి వచ్చింది. అద్దె ఇంటి సింహా ద్వారం (మెయిన్ డోర్) చెట్టు, విద్యుత్ స్తంభం, మరేదైనా భారీ అడ్డంకులు ఉండకూడదు. వాస్తు ప్రకారం తలుపు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంటే అందులో ఉండేవాళ్లకు లక్ష్మీ యోగం ప్రాప్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంట్లో అన్ని తలుపులు లోపలి వైపుకు తెరిచేలా ఉండాలి. ఇంట్లో తలుపులు, కిటీకిలు సరి సంఖ్యలో ఉండాలి. ముఖ్యంగా నైరుతిలో యజమాని శయ్య గృహం ( బెడ్ రూమ్), నైరుతిలో వంటగది, ఈశాన్యంలో ఇంట్లో దేవుడి గది లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది. వీలు లేకపోతే.. పడమర వైపు కూడా దేవుడి పూజా గది ఉండొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)