1)ఈశాన్య దిశ స్పష్టతకు బాధ్యత వహిస్తుంది. ఇది ధ్యానానికి సరైన ప్రాంతం. 2)ఈశాన్య తూర్పు దిశ వినోదానికి సంకేతం. కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఈ దిశలో ఉన్న గది అనువైన ప్రాంతం. 3)ఈస్ట్ జోన్ మంచి సంబంధాలను పెంపొందించుకోవడానికి అనువైన దిశ. అందువల్ల లివింగ్ రూమ్‌లకు దీన్ని సరైన ప్రాంతంగా పరిగణిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
4)ఆగ్నేయ తూర్పు దిశ మీ నిజ జీవిత లక్ష్యాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆందోళన తగ్గించే ప్రాంతం. 5)ఆగ్నేయ దిశ కరెన్సీ, నగదు, లిక్విడిటీకి సంబంధించింది. 6)దక్షిణ -ఆగ్నేయం శక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే దిశ. 7)దక్షిణం అనేది గుర్తింపు, సామాజిక ఖ్యాతి ఉన్న ప్రాంతం. (ప్రతీకాత్మక చిత్రం)
8)దక్షిణ- నైరుతి అనేది వ్యయానికి అంకితమైన ప్రాంతం. అందువల్ల, ఈ ప్రాంతం జీవితంలోని చెడును అంతం చేస్తుంది. 9)నైరుతి అనేది వివాహం, కుటుంబం, దృఢత్వం, సంబంధాలకు చెందిన ప్రాంతం. 10)నైరుతి పశ్చిమ భాగం అభ్యాసం, జ్ఞానం, విద్య, పెట్టుబడులకు చెందిన ప్రాంతం. 11)వెస్ట్ ఎండ్ మీకు అత్యధిక వ్యాపార లాభాలను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం
12)వాయువ్య పశ్చిమ భాగం ఒత్తిడి, నిస్పృహతో కూడిన ప్రాంతం. 13)వాయువ్యం ఆరోగ్యానికి సంబంధించిన దిశ. 14)వాయవ్య ఉత్తర భాగం ఆకర్షణ శక్తి, మంచి శృంగార అనుభూతిని ఇచ్చే దిశ. 15)ఉత్తరం అనేది నిరంతర వృద్ధి, అవకాశాల ప్రాంతం. 16)ఈశాన్య ఉత్తర భాగం మంచి ఆరోగ్యం, బలమైన రోగనిరోధక శక్తి అందించే దిశ. (ప్రతీకాత్మక చిత్రం)