తూర్పు : తూర్పుకు రాజు సూర్యుడు. తన వారి కోసం ప్రాణం ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే సూర్య భగవానుడిచే పాలించబడుతున్న తూర్పు ఇంట్లోకి ప్రవేశించడానికి గొప్ప దిశ. అందుకే మనం ఇంటిని నిర్మించుకుంటే తూర్పు దిశలోనే ప్రవేశ ద్వారాన్ని ఉంచుకుంటాం. ఉదయం పూట ఉండే సూర్యకాంతి ఒంటికి ఇంటికి మంచిదని వాస్తు శాస్త్రం చెబుతుంది. తూర్పు దిశలో లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, గార్డెన్ వంటి వాటిని ఉండేలా చూసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఉత్తరం : ఉత్తరం సంపదను ఇస్తుందని నమ్ముతారు. అలాగే ఉద్యోగాన్ని కూడా. ఈ దిక్కుగా పడక గదిని.. ద్వారాన్ని.. గార్డెన్ వంటి వాటిని ఏర్పాటే చేసుకోవచ్చు. తూర్పు దిక్కుగా ప్రవేశ ద్వారాన్ని నిర్మించుకోలేకపోతే మీరు ఉత్తరం దిక్కుగా ఏర్పాటు చేసుకోవచ్చు. కొందరు తూర్పు, పడమర రెండు దిక్కుల్లో ప్రవేశ ద్వారాలను నిర్మించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. (ప్రతీకాత్మక చిత్రం)
దక్షిణం : సంఘంలో గౌరవ మర్యాదలు ఉండాలంటే దక్షిణం దిక్కున మాస్టర్ బెడ్ రూంను ఏర్పాటు చేసుకోవాలి. అదే సమయంలో ఇంట్లోని పెద్దవారు అందులో నిద్రించాలి. అలా కాకుండా చిన్నవారు నిద్రిస్తే అది మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. హోమ్ థియేటర్ వంటి వాటిని కూడా దక్షిణం దిక్కులో ఏర్పాటు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)