Tulasi: తులసితో ఈ మొక్కలను ఎప్పుడూ నాటవద్దు.. లేదంటే ఇంట్లో ఎప్పుడూ సమస్యలే
Tulasi: తులసితో ఈ మొక్కలను ఎప్పుడూ నాటవద్దు.. లేదంటే ఇంట్లో ఎప్పుడూ సమస్యలే
Tulasi: హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. లక్ష్మీదేవిగా కొలుస్తారు. అందుకనే ప్రతి ఇంటిలోనూ తులసికి పూజలు చేస్తారు. ఐతే తులసితో కొన్నిమొక్కలను నాటడం... ఎంత మాత్రమూ మంచిది కాదట.
హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. తులసిని లక్ష్మీ దేవి ప్రతిరూపంగా కొలుస్తారు. అందుకే ఈ మొక్కను పవిత్రంగా భావించి.. ఉదయం సాయంత్రం పూజలు చేస్తారు. చాలా ఇళ్లల్లో తులసికి కోట కట్టి నిత్యం పూజిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ప్రతిరోజూ తులసికి నీటిని సమర్పించి పూజించడం ద్వారా శ్రీమహా విష్ణువు కూడా ప్రసన్నుడై అనుగ్రహాన్ని ఇస్తాడట. అంతేకాదు ఆరోగ్యపరంగా తులసి మొక్కల ఎంతో మేలు చేస్తుంది. ఐతే మనలో చాలా మంది తులసి మొక్క పక్కన ఇతర మొక్కలు కూడా పెంచుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. తులసి పక్కన కొన్ని రకాల మొక్కలను మొక్కలను అస్సలు నాటకూడదు. ఇలా చేయడం వల్ల తులసి శక్తి తగ్గుతుంది. ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మరి తులసి చుట్టూ ఏయే మొక్కలను పెంచకూడదో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
తులసితో పాటు కాక్టస్ మొక్కను ఎప్పుడూ నాటకూడదు. కాక్టస్కు ముళ్లుంటాయి. అందువల్ల దీనిని రాహు-కేతువులకు చిహ్నంగా పరిగణిస్తారు. ఈ మొక్క ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసారమవుతుంది. ఫలితంగా తులసి మొక్క శక్తి క్రమణంగా క్షీణిస్తుందట. ఇలా జరగడం అస్సలు మంచిది కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
కాక్టస్ మొక్కను తులసితో ఉంచకపోవడానికి మరో కారణం కూడా ఉంది. రాహు-కేతువుల దిశను నైరుతిగా పరిగణిస్తారు. తులసి మొక్కను ఈశాన్యంలో ఉంచుతారు. కాబట్టి రెండు మొక్కలను ఎప్పుడూ పక్కపక్కన ఉంచకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
జిల్లేడు మొక్కను కూడా ఎప్పుడూ తులసితో పాటు నాటకూడదు. కొంతమంది ఒకే కుండీలో రెండు మొక్కలను నాటుతారు. కానీ అలా చేయకూడదు. జిల్లేడు నుంచి పాలు కారుతాయి. ఇవి తులసి మొక్కపై పడటం వలన పాడైపోతుంది. అందువల్ల ఈ రెండు మొక్కలను కలిపి ఉంచకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)