VASTU TIPS FOR BAMBOO OF BAMBOO PLANT IS IN YOUR HOME KEEP THESE THINGS IN MIND OTHERWISE YOU MAY PROBLEMS SK
Vastu Tips: ఇంట్లో వెదురు మొక్క ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఇబ్బందులు తప్పవు
Vastu Tips: ఇంట్లో పచ్చని మొక్కలు ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే మానసిక ప్రశాంతతే కాదు.. వాస్తు ప్రకారం ఆ ఇంటికి చాలా మంచిదట. ముఖ్యంగా వెదురు మొక్కల ఇంట్లో ఉంటే ఆ కుటంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉండవట. మరి వెదురు మొక్కను పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇక్కడ చూద్దాం.
వాస్తుశాస్త్రంలో వెదురు మొక్కకు ప్రత్యేక స్థానముంది. వెదురు మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి ధనవంతులు కావడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గమని వాస్తు నిపుణులు చెబుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఇంట్లో లేదంటే ఆఫీసులో వెదురు మొక్కను నాటడం మంచిది. ఐతే అది సరైన దిశలో లేకుంటే ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అందువల్ల వెదురు మొక్కను నాటేటప్పుడు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. దానికి సంబంధించిన వాస్తు చిట్కాలను ఇక్కడ చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఇల్లు, కార్యాలయంలో వెదురు మొక్కను నాటడానికి తూర్పు ఉత్తమమై దిశ. ఈ దిశలో వెదురు మొక్కను నాటితే.. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. అంతేకాదు కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు ఇంట్లో వెదురు మొక్కను నాటాలనుకుంటే.. కిటికీ దగ్గర లేదా సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో ఉంచకూడదు. ఈ మొక్క ఎండలో పాడైపోతుంది. మొక్క ఎండిపోతే.. అది మీపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
వెదురు మొక్కలు మరీ ఎక్కువ ఎత్తు పెరిగేలా ఉండకూడదు. 2 నుంచి 3 అడుగుల ఎత్తు వరకు పెరిగే వెదురు మొక్కలు ఇంట్లో ఉంటే శుభప్రదం. ఆఫీసులో వెదురు మొక్కను ఉంటే పర్యావరణానికి బాగుంటుంది. అలాగే నెగెటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
వెదురు మొక్కను నాటడం వల్ల వ్యాధులు నయమవుతాయని, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. అంతేకాదు పడకగదిలో వెదురు మొక్కను ఉంచుకోవడం వల్ల వైవాహిక జీవితంలో మధురానుభూతి లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందట. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఇంట్లో వెదురు మొక్క ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఐతే పైన చెప్పిన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం..ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)