Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకుంటే.. ఖచ్చితంగా ధనవంతులవుతారట..!
Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకుంటే.. ఖచ్చితంగా ధనవంతులవుతారట..!
Vastu Tips: మనలో చాలా మంది ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేకపోతారు. అందుకు వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. అందువల్ల ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే.. మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి.. డబ్బు నిలుస్తుంది. మరి ఎలాంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలో తెలుసుకుందాం.
తమకు కష్టాలు రాకూడదని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సుఖసంతోషాలతో జీవించాలని కలలు కంటాడు. డబ్బకు ఇబ్బందులు ఉండకూడదని.. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా.. చాలా మందికి తమ కలలు నెరవేరవు. ఆర్థిక కష్టాలు తీరవు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
చాలా మంది డబ్బు బాగా సంపాదించినప్పటికీ.. మంచి నీళ్లలా ఖర్చవుతుంది. తెలియకుండానే కరిగిపోతుంది. తద్వారా ప్రతి నెలా ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు వాస్తుశాస్త్రంలో కొన్ని చిట్కాలను చెప్పారు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే డబ్బుకు కొదువ ఉండదట. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
హిందూ మతంలో తులిసి లక్ష్మీమాతగా కొలుస్తారు. ప్రతి రోజూ ఉదయం తులసి కోటకు పూజచేస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. తులసి మొక్కను ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి రోజు తులసి పూజ చేయడం వల్ల లక్ష్మీ దేవత ప్రసన్నమవుతుంది. మీ కష్టాలను తీర్చుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఇంటికి ఉత్తర దిశన నీటితో నింపిన మట్టి కుండను ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బుకు కొదువ ఉండదట. ఐతే ఈ కుండ ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదట. నీటితో ఉన్నప్పుడే మీకు మంచి జరుగుతుందట. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
చాలా మంది ఇళ్లల్లో లోహపు తాబేలు కనిపిస్తుంది. ఇంట్లో ఇలాంటి తాబేలు ఉండడాన్ని శుభప్రదంగా భావిస్తారు. లోహపు తాబేలును ఇంటికి ఉత్తర దిశలో ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. తాబేలు ముఖం ఇంటి లోపలి వైపున ఉండేలా చూసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఇంటి తలుపు లేదా కిటికీపైన స్పటిక బంతిని ఉంచితే మంచి జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. క్రిస్టల్ బాల్‌తో ఇంట్లో సంపద పెరుగుతుందట. అంతేకాదు అన్ని శుభాలే కలుగుతాయట. క్రిస్టల్ బాల్స్ ఈ-కామర్స్ వెబ్సైట్లలో లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)