కరోనా తర్వాత చాలా మంది ఉద్యోగులు (Employees) ఇంటినుంచే పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాస్తు శాస్త్ర నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇంటి నుంచి పని చేసే సమయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయని... వీటిని అధిగమించేందుకు ఉద్యోగులు వాస్తు (Vastu) శాస్త్రం ప్రకారం కొన్ని టిప్స్ (Tips) పాటించాలని అంటున్నారు. ఇంటి వద్దే ఆఫీస్ (Home Office) ఏర్పాటు చేసుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కొన్ని దిశల్లో మాత్రమే ఆఫీస్ ఉండాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా నాలుగు వాస్తు చిట్కాలు అనుసరించడం ద్వారా పనిలో విజయం సాధించడం సులభం అవుతుందంటున్నారు. అవేంటో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
స్పెషల్ వర్క్‌స్టేషన్
పని చేసేటప్పుడు రోజూ ఒకే స్థలంలో కూర్చోవడం చాలా ముఖ్యం. ల్యాప్‌టాప్‌ను తీసుకొని కాసేపు మంచంపై పడుకొని పని చేయడం, కాసేపు కుర్చీలో కూర్చోవడం.. ఇలాంటి ధోరణి వల్ల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. బదులుగా మీ వర్క్‌స్టేషన్‌ను ఒక పూజ గది లాగా భావించి అక్కడే ప్రతిరోజూ పని చేసుకోవడం మంచిది. అక్కడ నుంచి పని చేస్తేనే మీరు ఎక్కువ ఏకాగ్రతతో పని చేయగలుగుతారు. ఒకే స్థలం నుంచి పనిచేయడం వల్ల మీకు పని గురించి తప్ప ఇతర ఆలోచనలు రావు. ఏకాగ్రత అసలు దెబ్బతినదు. (ప్రతీకాత్మక చిత్రం)
* వర్క్‌స్టేషన్ దిశ
సూర్యుడు ఉదయించే తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు లేదా ఈశాన్యం వైపు తిరిగి వర్క్ చేసుకుంటే మీ తెలివి బాగా మెరుగుపడుతుంది. మీ వీపు గది ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గది ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉండటం వల్ల మీ మనస్సు మరింత చంచలంగా మారుతుంది. దీనివల్ల మీరు వెంటనే అలసిపోతారు. మీలో ఆందోళన కూడా అధికమవుతుంది.
అరోమా థెరపీ
ఆఫీస్ డెస్క్ మూలలో సువాసన గల ఎసెన్షియల్ ఆయిల్స్ వెదజల్లే ఆయిల్ డిఫ్యూజర్ (Oil Diffuser) ఉంచడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా పని చేయగలుగుతారు. రట్టన్ స్టిక్స్ (Rattan Sticks) లేదా ఎండిన పూరేకులు పెట్టుకునేందుకు వీలుగా పాట్పౌరీ (Potpourri)ని ఉంచినా మీలో ఉత్సాహం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)