[caption id="attachment_1298512" align="alignnone" width="1600"] వాస్తు శాస్త్రంలో గౌతమ బుద్ధుడికి చాలా ప్రధాన్యం ఉంది. మానసిక ప్రశాంతతకు, జ్ఞానానికి ప్రతీకగా బుద్ధుడిని భావిస్తారు. బుద్ధుడికి సంబంధించిన చిన్నపాటి విగ్రహాలను మన ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో ఉంచుకుంటే చెడు ఆలోచనలే రావని వాస్తు శాస్త్ర నమ్మకం. ఇంట్లో బుద్ధుడి విగ్రహాలను ఏ ఏ ప్రదేశాల్లో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి ప్రధాన ద్వారం (Entrance Door) ముందు బుద్ధుడి విగ్రహాన్ని ఉంచితే.. చెడు అనేది ఇంట్లోకి ప్రవేశించదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అదే విధంగా ఈ విగ్రహం చుట్టూ ఉన్న పరిసరాలకు కూడా రక్షణ దొరుకుతుందని భావిస్తారు. అయితే విగ్రహాన్ని నేలపై కాకుండా కనీసం మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో ఉంచాలని వాస్తు నిపుణులు అభిప్రాయపడతారు. (ప్రతీకాత్మక చిత్రం (Image: AP))
[caption id="attachment_1298522" align="alignnone" width="1200"] లివింగ్ రూంలో కూడా బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. పడమర దిక్కుగా బుద్ధుడి మొహం ఉండేటట్లు చూసుకోవాలి. లివింగ్ రూంలో బుద్ధడి విగ్రహం ఉంటే.. ఆ ఇంట్లోని వారికి చికాకు పెట్టే విషయాలు జరగవని.. ప్రశాంతంగా ఉంటారని నమ్ముతారు. ఈ విగ్రహాన్ని ఒక బల్లపై కానీ, లేదా సెల్ఫ్ లో కానీ ఉంచొచ్చు. కానీ అవి శుభ్రంగా ఉండేలా చూసుకోండి.