Vastu Shastra: ఏ ఇల్లైనా ప్రశాంతంగా ఉండాలంటే... ఆ ఇంట్లో దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థలూ, పొరపొచ్చాలూ, గొడవలూ లేకుండా ఉండాలి. తల్లిదండ్రులు గొడవలు పడుతూ ఉంటే... ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. మానసికంగా దెబ్బతింటారు. వారు పెద్దవారయ్యాక... పెళ్లిపై వారికి నెగెటివ్ అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా చూసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
మన ఇళ్లలోని కొన్ని రకాల వస్తువులు చెడుకు సంకేతాలుగా ఉంటాయి. అవి నెగెటివ్ ఎనర్జీని లాక్కుంటూ ఉంటాయి. ఆ వస్తువులతోనే జీవించేవారిపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావం పడుతుంది. సపోజ్ ఒకరికి ఆవలింత వస్తే... మిగతా వారికీ ఆవలింతలు వస్తాయి. ఒకరు గొంతు సరిచేసుకుంటే మిగతావారూ సరిచేసుకుంటారు. అలాగే... ఇళ్లలోకి ప్రవేశించిన నెగెటివ్ ఎనర్జీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ... ఇంట్లో అశాంతి, గొడవలు జరిగేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందుకోసం ఆ దంపతులు... ఓ గిన్నెలో గుప్పెడు కల్లు ఉప్పు తీసుకొని... బెడ్రూంలోని ఓ మూల ఉంచాలి. ఓ నెలపాటూ దాన్ని అలాగే ఉంచాలి. నెల తర్వాత ఆ గిన్నెలో ఉప్పును బయట పారవేసి... మరో గుప్పెడు ఉప్పును గిన్నెలో పోసి... మళ్లీ అదే మూలన ఉంచాలి. ఇలా ప్రతినెలా చేస్తూ ఉండాలి. ఉప్పును మార్చిన ప్రతిసారీ వెంటనే స్నానం చేసి... ఇష్టదైవానికి పూజ చేసుకోవాలి. తద్వారా నెగెటివ్ ఎనర్జీ వారిలోకి రాకుండా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)