జనరల్‌గా మనం కష్టపడితే సంపాదించగలం. వాస్తుశాస్త్రం కాస్త భిన్నంగా ఉంటుంది. మన ఆలోచనలకు అందని విధంగా ఉంటుంది. డబ్బు పెరగాలంటే ఓ చేపను పెంచాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అది ఏ గోల్డ్ ఫిష్షో అయితే వెంటనే కొని పెంచుకోవచ్చు. కానీ వారు ఎరోవానా చేప (Arowana fish)ను పెంచుకోవాలని అంటున్నారు. (Image credit - twitter)
ఈ చేపను పెంచడానికీ, మన సంపద పెరగడానికీ సంబంధమేంటి అనే ప్రశ్న మనకు రావచ్చు. నిపుణులు ఏమంటున్నారంటే... ఈ చేప చెడు శక్తులు, నెగెటివ్ ఎనర్జీలను లాగేసుకుంటుందని చెబుతున్నారు. అందువల్ల ఈ చేపను ఇంట్లోకి తెచ్చినప్పటి నుంచి ఇక ఆ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతూ... సంపద పెరుగుతుందని అంటున్నారు. (Image credit - twitter)
కొంత మంది ఇళ్లలో చేపలు పెంచుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారికి మరో ఆప్షన్ ఉంది. బంగారు ఎరోవానా చేప విగ్రహం చేయించుకొని... దాని నోట్లో ఓ నాణేన్ని ఉంచాలి. ఆ విగ్రహాన్ని ఇంట్లోని ఈశాన్య మూల ఉంచాలి. అదే నిజమైన చేపనే పెంచితే... ఆ చేప ఎక్వేరియంను ఈశాన్య మూల ఉంచాలని చెబుతున్నారు. (Image credit - twitter)