ఇదంతా వినడానికి మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాంటి ఆలయం కూడా ఉందా అనిపిస్తుంది. ఇక్కడ మహాదేవుడు... మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. సాత్విక రూపం, రజస్వ రూపం, తామస రూపం. ప్రత్యేక పండుగ దినాల్లో స్వామిని మూడు రూపాల్లో అలంకరిస్తారు. ఉదయం వేళ చిన్నారి స్వామిగా భావిస్తూ... చాక్లెట్లు, బిస్కెట్లు, పండ్లు ఇస్తారు. చాలా మంది వీటిని పిల్లల ద్వారా ఇప్పిస్తారు. ఇక మధ్యాహ్నం వేళ పప్పు, రైస్, బ్రెడ్, కూరగాయలను సమర్పిస్తారు. రాత్రి మాత్రం మహా హారతి తర్వాత... మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చేపల కర్రీ, మద్యం సమర్పిస్తారు. వాటితోపాటూ... ఎగ్ ఆమ్లెట్ కూడా భైరవుడి రూపంలోని స్వామికి సమర్పిస్తారు.