* వృషభం : ఈ రాశివారు ఏదైనా లగ్జరీగా ఉండాలనుకుంటారు. మంచి ఆహారం, వైన్, స్పా వంటివాటిని ఎక్కువగా ఇష్టపడతారు. ద్రాక్షతోటలు లేదా స్పా రిసార్ట్ వంటి ప్రదేశాలను రొమాంటిక్ ట్రిప్ వెళ్తే బెటర్. ఈ రాశివారు కల్చర్‌ను అన్వేషించడానికి ఇష్టపడతారు. దీంతో సంప్రదాయాలకు నిలయమైన ప్రాంతాలను సందర్శించేలా ట్రిప్ ప్లాన్ చేయండి.
* సింహం : ఈ రాశివారు సహజంగా నాటకీయతను ప్రదర్శిస్తుంటారు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడతారు. దీంతో ముంబై, బెంగళూరు వంటి విలాసవంతమైన ప్రాంతాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. ఈ రాశివారు రొమాంటిక్‌గా ఉంటారు. కాబట్టి రొమాంటి లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయడానికి అనవైన ప్రదేశాలు ట్రిప్‌లో ఉండేటట్లు చూసుకోండి.
* కన్య : ఈ రాశివారు ప్రాక్టికల్‌గా ఉంటారు. ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేయడానికి ఇష్టపడతారు. రోమ్ లేదా టోక్యో వంటి అద్భుతమైన సాంస్కృతిక ప్రదేశాలను రొమాంటిక్ ట్రిప్‌కు పరిగణలోకి తీసుకోవచ్చు. కన్య రాశి వారు చురుకుగా ఉంటారు. దీంతో హైకింగ్ లేదా సైక్లింగ్ వంటి అవుట్ డోర్ యాక్టివిటీస్ ఉండేట్లు ట్రిప్ ప్లాన్ చేసుకోవడం బెటర్.
* వృశ్చికం : రహస్యం, అంతుబట్టని విషయాలను తెలుసుకోవడంలో ఈ రాశివారు మక్కువ చూపుతారు. దీంతో కోల్‌కతా, వారణాసి వంటి గొప్ప చరిత్ర ఉన్న ప్రదేశాలను ఈ వాలంటైన్స్ డే సందర్భంగా రొమాంటిక్ ట్రిప్‌కు పరిగణలోకి తీసుకోండి. పురాతన శిధిలాలు, ప్రాచీన దేవాలయాలను అన్వేషించవచ్చు. ట్రెక్కింగ్ లేదా క్యాంపింగ్ వంటి అవుట్ డోర్ యాక్టివిటీస్ ప్రదేశాలను పరిగణలోకి తీసుకోండి.
* మకరం : ఈ రాశివారు ప్రాక్టికల్‌గా ఉంటూ ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు. పని, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌ను బ్యాలెన్స్ చేసే డిస్టినేషన్ ఈ రాశివారికి సెట్ అవుతుంది. దీంతో ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా రొమాంటిక్ ట్రిప్ కోసం హాంకాంగ్ లేదా సింగపూర్ వంటి వ్యాపార అనుకూలమైన ప్రదేశాలను పరిగణలోకి తీసుకోవచ్చు. నగరాన్ని అన్వేషించవచ్చు, ఏదైనా మీటింగ్ ఉండే అందుకు హాజరుకావచ్చు.