ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రాలలో అత్యంత భక్తి ప్రపత్తులతో కుంభమేళా నిర్వహిస్తుంటారు. 3 సంవత్సరాల వ్యవధికో ఒక్కొక్కొ క్షేత్రంలో కుంభమేళాను జరపటం ఇప్పటిదాకా ఆనవాయితీగా వస్తోంది. ఉత్తరాఖాండ్ నైరుతీ భాగంలోని హరిద్వార్ నగర వైశాల్యాన్ని చూస్తే 2,360 కిలోమీటర్లు. ఇది సముద్ర మట్టానికి 249.7 మీటర్ల ఎత్తులో, ఈశాన్య దిశగా శివాలిక్ కొండలకు దక్షిణంగా గంగానది మధ్యభాగంలో ఉంది.