మిథునం :(Gemini) మీరు ఎంతో కష్టపడి ప్రయత్నం చేసి ఉండొచ్చు. దాన్ని గుర్తించలేదని నిరాశ చెందకుండా మీ భావాలను వ్యక్తం చేయండి. అలా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు సరిచేసుకుని హుందాగా మాట్లాడండి. మీ తోటి ఉద్యోగులే మీ ఇమేజ్ను దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. లక్కీ సైన్ – బ్రాంజ్ వాలెట్
ధనస్సు:(Sagittarius) ఏదైనా సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. మీ కోపం వల్ల పరిష్కారం దొరకదు. అందుకని మీ భావోద్వేగాలను కాస్త అదుపులో ఉంచుకోండి. రేసులు, పేకాట వంటి గ్యాబ్లింగ్ ఆటలకు దూరంగా ఉండండి. త్వరలో కొత్త వాహనం కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్కీ సైన్ – క్లియర్ క్వార్ట్జ్