Ugadi 2023: వివిధ రాశులకు సంబంధించి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఫలితాలను పండితులు తెలియజేస్తున్నారు. ప్రధాన గ్రహాలైన శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల స్థితిగతులను బట్టీ... ఇతర గ్రహాల సంచారాన్ని బట్టీ రాశుల ఫలితాలను చెబుతారు. వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారం చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని గమనించాలి.
ఈ రాశి వారికి శని దశమ స్థానంలోనూ, గురు రాహులు వ్యయ స్థానంలోనూ, కేతువు ఆరవ స్థానంలోనూ సంచరిస్తున్నందువల్ల ఉద్యోగపరంగా అధికార యోగం పట్టడం, ప్రమోషన్లు రావడం, ఆదాయం పెరగటం వంటివి జరుగుతాయి. మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. నిరుద్యోగులు తీపి కబురు అందుకుంటారు.
ఏప్రిల్ నుంచి అదృష్టం : ఏప్రిల్ నెల చివరి నుంచి జూలైలోగా ఈ రాశి వారికి కొన్ని శుభవార్తలు చెవిన పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపార రంగాలకు చెందినవారు దాదాపు రెట్టింపు లాభాలు గడించే సూచనలు ఉన్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మనసులోని ఒకటి రెండు ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది.