Ugadi 2023: వివిధ రాశులకు సంబంధించి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఫలితాలను పండితులు తెలియజేస్తున్నారు. ప్రధాన గ్రహాలైన శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల స్థితిగతులను బట్టీ... ఇతర గ్రహాల సంచారాన్ని బట్టీ రాశుల ఫలితాలను చెబుతారు. వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారం చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని గమనించాలి.
డబ్బే డబ్బు : ఈ రాశి వారికి ఏడాదంతా శని గురు రాహులు కేతువు చాలావరకు అనుకూలంగా ఉండటం వల్ల పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తయి, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడటానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆకస్మిక ధన లాభం వంటి అదృష్టాలు పట్టే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కూడా ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి.
త్వరలో కొత్త జీవితం : ఉగాది తర్వాత నుంచి ఈ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు ప్రారంభం అవుతాయని చెప్పవచ్చు. వీరు చేపట్టే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఉద్యోగం చేస్తూనే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఏడాదంతా ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలే ఎక్కువగా అంది వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తీర్థయాత్రలు వినోద యాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు.
ముఖ్యమైన సూచనలు : ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం చాలా మంచిది. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను బయట పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బందుల పాలవుతారు. బంధువర్గం నుంచి అపనిందలు మీద పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ప్రతి నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.