వివిధ రాశులకు సంబంధించి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఫలితాలను ఇక్కడ అందజేస్తున్నాం. ప్రధానగ్రహాలైన శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల స్థితిగతులను బట్టి ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి ఈ రాశుల ఫలితాలను చెప్పడం జరుగుతోంది.
2/ 10
అయితే, వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారం చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని గమనించాలి.
3/ 10
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 1.
4/ 10
మొదటి రాశిలో శని, మూడవ రాశిలో గురు రాహువులు, తొమ్మిదవ రాశిలో కేతువు సంచరిస్తున్నందు వల్ల, ఈ రాశి వారికి ఈ ఏడాదంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఏలిన్నాటి శని జరుగుతున్నప్పటికీ ఉద్యోగంలో ను, ఆర్థికంగానూ స్థిరత్వం ఏర్పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం )
5/ 10
ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆదాయం మెరుగ్గానే ఉన్నా ఏదో రూపంలో ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
6/ 10
ఇక నుంచి మంచి కాలం: ఈ నెల తర్వాత నుంచి ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలు అనుభవానికి రాకపోవచ్చు కానీ యధాతధ స్థితికి లోటు ఉండదు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మున్ముందు మంచి ఫలితాలను ఇస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
7/ 10
కుటుంబంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అన్ని విషయాలలోనూ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ పెద్దల అండదండలు ఉంటాయి. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాజిటివ్ దృక్పథంతో వ్యవహరించడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
8/ 10
కొన్ని ముఖ్యమైన పనులు: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కొత్త ప్రయ త్నాల వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
9/ 10
ప్రయాణాల్లో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రతినిత్యం ఉదయమే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
10/ 10
Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.