Ugadi 2023 - Shobha Krit | వివిధ రాశులకు సంబంధించి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఫలితాలను ఇక్కడ అందజేస్తున్నాం. ప్రధానగ్రహాలైన శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల స్థితిగతులను బట్టి ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి ఈ రాశుల ఫలితాలను చెప్పడం జరుగుతోంది. అయితే, వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారం చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని గమనించాలి.(ప్రతీకాత్మక చిత్రం)
ఒక పథకం ప్రకారం పనులు చేపడితే ఆర్థికంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. ఐటీ నిపుణులు ఎంతగానో రాణిస్తారు. విదేశీ అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
పరిహారాలు అవసరం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆహార విహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాగ్దానాలు చేయటం కానీ, హామీలు ఉండటం కానీ చేయవద్దు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయడం మంచిది. విష్ణు సహస్రనామం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఈ రాశి వారికి అన్ని రంగాల్లోనూ పురోగతి సాధ్యం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)