మేషరాశి.. ఈ రాశివారు డబ్బు ఆదా చేయాలంటే.. కొన్ని భోగాలకు దూరంగా ఉండాలి. దీన్ని ఛాలేంజింగ్ తీసుకోవాలి. వారంతపు లక్ష్యాలను పెట్టుకోండి. రోజంతా, లేదా వారం మొత్తం వృథా ఖర్చు చేయకుండా ముందుకు సాగండి. ఒకవేళ మీకు షాపింగ్ చేయాల్సి వస్తే.. కార్డును ఇంట్లోనే పెట్టండి. కేవలం మీకు అవసరమైన వాటిని మాత్రమే కొనండి. అంతమేరకే నగదు తీసుకెళ్లండి.
సింహరాశి.. సింహరాశివారు కంగారు పడి ఎమోషనల్ షాపింగ్ చేయకండి. ఖర్చులో కాస్త ఆచరణాత్మకంగా ఉండండి. ఇక బహుమతుల విషయానికి వస్తే.. కాస్త వినూత్నంగా ఆలోచించండి. మీ భాగస్వామికి ఖరీదైన పియానో లేదా గిటార్ కొనుగోలు చేయాల్సి వస్తే.. బదులు కలిసి మ్యూజిక్ క్లాస్ కు వెళ్లండి. దీంతో ఆ క్షణాలు మధురంగా.. ఖర్చు తక్కువగా ఉంటుంది.