Horoscope today: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. ఇవి ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... వారి రాశి ఫలాలపై మంచి, చెడు ఫలితాలు ప్రభావం చూపుతాయి. మంచి జరిగే అవకాశం ఉంటే... ఆనందమే. అదే చెడు జరిగే అవకాశం ఉంటే... అప్రమత్తం అవ్వాలి. మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో అలర్ట్‌గా ఉండాలి. అలా మనల్ని అప్రమత్తం చెయ్యడంలో రాశిఫలాలు ఉపయోగపడతాయి. మరి 16-11-2021 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో చూడండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఈరోజు మేష రాశి వారు సహనంతో ముందుకెళ్లడం మంచిది. ఆదాయం విషయంలో అసంతృప్తి లేదా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. వేరొకరి సహాయం లేదా ఆమోదంపై ఆధారపడటం గురించి మీరు ఆందోళన చెందుతారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. వ్యక్తిగత అవసరాల కోసం అడ్డూఅదుపూ లేకుండా చేసే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. మనసులో ఉన్న ఆందోళనను, అయోమయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించండి. తద్వారా మీరు మానసికంగా ధృడంగా ఉండి మేలు కలిగించే నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఇవాళ మీ అదృష్ట అక్షరాలు A, L, E. అదృష్ట సంఖ్యలు 1, 8.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఈ రోజు వృషభ రాశి వారికి సంబంధ బాంధవ్యాలు బలపడి సంతోషాన్ని కలుగజేస్తాయి. జీవిత భాగస్వామితో మీ లక్ష్య సాధనకు సంబంధించిన విషయాలను పంచుకోవడం, మీ మనసులో మాట చెప్పటానికి ఇదే మంచి సమయం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. అనుకున్న కార్యం తలపెట్టేందుకు వృషభ రాశి వారికి ఇవాళ అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలను ఆచరణలోకి తేవడం, మీ అభిరుచికి తగినట్టుగా ప్రవర్తించడం మంచిది. ఏకాగ్రతతో మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. ఇవాళ మీ అదృష్ట అక్షరాలు B, V, U అక్షరాలు. ఇవాళ మీ అదృష్ట సంఖ్యలు 2, 7.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) మిథునరాశి వారికి దీర్ఘకాలంగా అడ్డంకిగా మారిన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ కార్యంలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు కలిసి వస్తుంది. వ్యాపార వృద్ధికి, విస్తరణకు ఇదే మంచి సమయం. ఇవాళ మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఇవాళ మీ అదృష్ట సంఖ్యలు 3, 6. K, C, G అక్షరాలు మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఈ రాశి వారికి ఇవాళ మంచి కాలం నడుస్తోంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ముందుకెళితే అంతా శుభమే జరుగుతుంది. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కోర్టు కేసులో గెలిచే సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 4. H, D అదృష్ట అక్షరాలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఈ రాశి వారికి ఇవాళ మీ సృజనాత్మక సామర్థ్యంతో సత్ఫలితాలను పొందుతారు. ఇంటికి సంబంధించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం, ఆరోగ్యపరంగా సంతృప్తి ఉంటుంది. మీ తెలివితేటల వల్ల కుటుంబపరంగా, ఉద్యోగపరంగా మెప్పు పొందుతారు. మీ శత్రువులు కీడు తలపెట్టే అవకాశాలున్నాయి. అందువల్ల.. మరింత అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. మీ ప్రత్యర్థులు బాధపెట్టడానికి ప్రయత్నించవచ్చు. మానసికంగా దృఢంగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 5. M, T అక్షరాలు మీకు కలిసొచ్చే అదృష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2) ఈ రాశి వారికి ఇవాళ ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకు కొత్తదారులు దొరుకుతాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. గతంలో నిలిపివేసిన పనులు ఇవాళ చేస్తే కలిసొచ్చే అవకాశం ఉంది. పనులు కొద్దిగా ఆలస్యమైనా అనుకూలంగానే పూర్తవుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి ఉంటుంది. లావాదేవీల విషయంలో వ్యాపారులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. అదృష్ట అక్షరాలు P,T, N. 3,8 సంఖ్యలు అదృష్టాన్ని అందిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఈ రాశి వారికి కుటుంబపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశాలున్నాయి. పక్కన పెట్టిన ఏ పనినైనా ప్రస్తుతానికి వదిలేయడం మంచిది. ఇవాళ పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంది. గతంలో ఎదురైన ఇబ్బందులను, తలెత్తిన లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లడం మంచిది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల భాగస్వామ్యంతో వ్యాపారం చేసినవారు.. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్యలు 2,7. అదృష్ట అక్షరాలు R, T.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఈ రాశి వారికి వైవాహిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో నిజాలు దాచడం, అబద్ధాలు చెప్పడం చేయకండి. తెలివితేటలు ఉన్నప్పటికీ దుర్వ్యసనాల కారణంగా చులకన అవుతారు. అలాంటి అలవాట్లు మానుకోవడం మంచిది. ఈరోజు జీవిత భాగస్వామి మానసిక స్థితి సరిగా ఉండదు. సహచర ఉద్యోగులు, ఉన్నతాధికారులతో మెరుగైన సంబంధాలు కలిగి ఉంటారు. ఆర్థికంగా మంచి ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల ఆర్ధిక వ్యవహారాలకు దూరంగా ఉండండి. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యను పరిష్కరించడానికి ఇది సరైన రోజు. అదృష్ట అక్షరాలు N, Y. అదృష్ట సంఖ్యలు 1, 8.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. క్షమా గుణం మేలు చేస్తుంది. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అదృష్ట అక్షరాలు B, D, P. అదృష్ట సంఖ్యలు 9, 12.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం,ధనిష్ఠ 1,2) ఈ రాశి వారికి ఇవాళ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బంధువుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. అదృష్ట సంఖ్యలు 10, 11. K, J అక్షరాలు మీకు అదృష్టాన్ని తెస్తాయి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఈ రాశి వారికి వ్యాపారపరంగా చికాకులు ఎదురవుతాయి. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు చేటు చేస్తాయి. మనోధైర్యంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడుతుంది. ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఆరోగ్యం సంగతే చూసుకోవాలి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచలున్నాయి. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. అదృష్ట అక్షరాలు G, S. అదృష్ట సంఖ్యలు 10, 11.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి సన్నిహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్‌వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాదనలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతాన కలిగే సూచనలు కనిపిస్తాయి. డబ్బు నష్టపోతారు జాగ్రత్త. కలిసొచ్చే అక్షరాలు D, C, J, T. అదృష్ట సంఖ్యలు 9, 12.