Horoscope Today: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. ఇవి ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా వారి రాశి ఫలాలపై మంచి, చెడు ఫలితాలు ప్రభావం చూపుతాయి. మంచి జరిగే అవకాశం ఉంటే.. ఆనందమే. అదే చెడు జరిగే అవకాశం ఉంటే.. అప్రమత్తం అవ్వాలి. మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో అలర్ట్గా ఉండాలి. అలా మనల్ని అప్రమత్తం చెయ్యడంలో రాశిఫలాలు ఉపయోగపడతాయి. మరి 03-12-2021 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో చూద్దాం.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేయండి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికంగా చాలా బాగుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధ తప్పదు. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. స్నేహితుల మీద ఖర్చు చేస్తారు. పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టే వారుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి డోకా లేదు. కొ త్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతం నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. సహచరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. ఇంట్లో వారితో చర్చించి నిర్ణయా లు తీసుకోండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగంలో పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ధనయోగం కనిపిస్తోంది. కుటుంబ పెద్దల వల్ల మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మికంగా సమయం గడుపుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. రుణ బాధ కొద్దిగా తగ్గుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సహోద్యోగులు సహకరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ధన లాభం ఉంది. శుభవార్త వింటారు. ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఖర్చులకు కళ్లెం వేయాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో మంచి విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. దేనికీ అధైర్యపడవద్దు. కుటుంబం విషయంలో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో చక్కటి లాభాలు ఆర్జిస్తారు . ముఖ్యమైన పనిలో ఆటంకాలు తొలగుతాయి. సన్నిహితులతో మీ ఆలోచనల్ని పంచుకోవడం అన్ని విధాలా మంచిది.