మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : గురు గ్రహం వక్ర త్యాగం చేసినందువల్ల ఇక కొన్ని ఆరోగ్య, ఆర్థిక సమస్యలు చాలావరకు తొలగిపో తాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : నేటితో గురు గ్రహం రుజు మార్గంలో సంచారం చేయడం మీకు అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఆర్ధి కంగా, ఉద్యోగపరంగా చాలావరకు బాగుంటుంది. పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) : గురు గ్రహం వక్ర మార్గం పదిలి రుజు మార్గంలో సంచరిస్తున్నందువల్ల ఉద్యోగంలో మంచి అధికార యోగం కనిపిస్తోంది. మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ పెద్దల సహకారం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పరవాలేదు. విశ్రాంతి అవసరం.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : గురు గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. అదృష్ట యోగం పడుతుంది. ఉద్యోగపరంగా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉం . ఆరోగ్య పరవాలేదు. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కోర్టు కేసులో నెగ్గుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలుంటాయి. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అం దుతాయి, రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త1,2) : గురు గ్రహ సంచారం అనుకూలంగా మారింది. ఫలితంగా అకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. శ్రమ ఫలించి పనులు కొన్ని పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు సరిపడ డబ్బు అందుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ణ) : గురు గ్రహం నేటి నుంచి రుజు మార్గంలో సంచారం చేయడం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అధికారుల వేధింపులు తగ్గుతాయి. ఇతరుల మీద ఆధారపడకుండా వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోండి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : రాశి అధిపతి అయిన గురు గ్రహం వక్ర త్యాగం చేసినందువల్ల ఆటంకాలు తొలగి ముఖ్యమైన పను ల్లో విజయం వరిస్తుంది. ఆశించిన స్థాయిలో వ్యాపారంలో లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. కీలకమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టు డబ్బు అందుతుంది.
మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశికి తృతీయంలో గురు గ్రహం రుజు మార్గంలో సంచరిస్తున్నందువల్ల ఉద్యోగపరంగా శుభ యో గం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థికంగా కోలుకుంటారు. ఇబ్బందుల్లో ఉన్న మిత్రుల్ని ఆదుకుంటారు. పని ఒత్తిడి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. శ్రమ మీద కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశికి ద్వితీయ రాశిలో గురువు సంచారం చేస్తున్నందువల్ల తలచిన పనులు త్వరగానే పూర్తవుతాం . వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ ఎక్కడా హామీలు ఉండొద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : రాశినాథుడు రుజు మార్గంలో సంచారం ప్రారంభించినందువల్ల కొన్ని ఉద్యోగ, కుటుంబ సమస్యల నుంచి క్రమంగా బయటపడతారు. ఓర్పుతో వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పరిచయస్థులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలేదు.