మేషం(Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగపరంగా మంచి సమయం. వ్యాపారంలో శ్రమ పెరిగినా మంచి ఫలితాలు అనుభవానికి వస్తా యి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచి స్తారు. అప్పులు తీరుస్తారు. శుభవార్తలు వింటారు. మిత్రులకు మీ వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.(ప్రతీకాత్మకచిత్రం)
వృషభం (Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థికంగా అనుకూల సమయం. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. అరోగ్యానికి ఢోకా లే దు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు సునాయాసంగా లాభాలు ఆర్జిస్తారు.(ప్రతీకాత్మకచిత్రం)
మిథునం(Gemini):(మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) ముఖ్యమైన యపనులు పూర్తి కావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. అను కోని సమస్య ఎదురవుతుంది. ఉద్యోగ, వ్యాపారంలో శుభవార్త వింటారు. మిత్రులు సహాయపడతారు . సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. ప్రమాదాల పట్ట జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. (ప్రతీకాత్మకచిత్రం)
కర్కాటక రాశి (Cancer):(పునర్వసు4,పుష్యమి, ఆశ్లేష) అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. అవసరమైన సహాయం అందు తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆంతరంగిక విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. అ రోగ్యం పరవాలేదు. (ప్రతీకాత్మకచిత్రం)
సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1) వృత్తి ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలం గా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రయాణాలు కలసి వస్తాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)
కన్య (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా ముందుకు సాగిపోతాయి. స్వయంకృషితో మంచి పేరు తెచ్చుకుంటారు . సంపద పెంచుకునే అలోచన చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడిని తట్టుకుని సత్ఫలితాలు సాధిస్తారు. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. (ప్రతీకాత్మకచిత్రం)
తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వృత్తి ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ప్రతి విషయాన్నీ కుటుంబ సభ్యులతో చర్చించి సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ధనలాభానికి అవకాశం ఉంది. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండండి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.(ప్రతీకాత్మకచిత్రం)
వృశ్చికం (Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. ఇంటా బయటా మీ కృషికి తగిన ఫలితం లభిస్తు౦ది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు తొలగుతాయి. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఎవరికీ హా మీలు ఉండొద్దు. (ప్రతీకాత్మకచిత్రం)
ధనుస్సు (Sagittarius):(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) శక్తి వంచన లేకుండా కృషి చేసి పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి స హాయ సహకారాలు అందుతాయి. దగ్గరి బంధువులకు మీ వల్ల మేలు జరుగుతుంది. అనుకోని విధం గా కొద్దిగా డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదరవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)
మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) మంచి జీవితం కోసం మార్గాలు ఆలోచిస్తారు. అనుకున్న పనులు శ్రమ మీద పూర్తవుతాయి. బంధు మిత్రుల రాకపోకలు ఉంటాయి. ఆదాయం పరవాలేదు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నష్టం జరగవచ్చు. ఆరోగ్యం పరవాలేదు.(ప్రతీకాత్మకచిత్రం)
కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగ, వ్యాపారాల్లో మీ కృషి సత్ఫలితాలనిస్తుంది. ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఎన్ని అవరో ధాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిం చాలి. ఆరోగ్యం బాగుంటుంది. గృహ ప్రయత్నం ఫలిస్తుంది. సంతానం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. (ప్రతీకాత్మకచిత్రం)
మీనం (Pisces):(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త, వివాదాలకు దూరంగా ఉండండి. (ప్రతీకాత్మకచిత్రం)