మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో సహోద్యోగులు సమస్యలు సృష్టిస్తారు. ఆదాయం పర్వావాలేదు. ఆరోగ్యం జాగ్రత్త, అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కష్ట సమయంలో బంధుమిత్రులు సహాయమందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం (కృత్తిక 2, 3, 4 రోహిణి, మృగళిర 1, 2) ఉద్యోగం ఆనందంగా గడిచిపోతుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధ౦ కుదురుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
మిథునం (మృగశిర 3, శీ ఆర్ష, పునర్వసు 1,2,3) ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా కొన్ని చికాకులు ఉన్నా నెట్టుకొస్తారు. ఆరోగ్యం పరవాలేదు. సన్నిహితులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం టెన్షన్ పెడుతుంది. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి, ఆశ్లేష) కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. అయితే, ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. తిప్పట ఉన్నప్పుటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దగ్గర బంధువు అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలవారు అభివృద్ది సాధిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. బాధ్యతల మార్పు ఉంటుంది. ఆదాయంలో ఆశించినంత పెరుగుదల ఉండదు. ఖర్చులు అదుపు తప్పుతాయి. బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. పెళ్లి సంబంధం విషయంలో స్పందన ఉండదు. సంతానం పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంటుంది.
కన్య (ఉత్తర 2, 3 4 హస్త, చిత్త 1 2) ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. ఆర్థికంగా బాగానే ఉ౦టుంది. పెళ్లి సంబంధం విషయంలో నిరాశ కలుగుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్టిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
తుల (చిత్త 3, 4ఉ స్వాతి, విశాఖ1, 23) ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి.
వృశ్చికం (విశాఖ & అనూరాధ, జ్వేష్ట) ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులు ఇబ్బంది పెడతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ప్రమోషన్‌కి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. మంచి పెల్లి సంబంధం కుదురుతు౦ది. వ్యాపారులకు ఆర్థికంగా పరవాలేదు. వృత్తి నిపుణులు తమ తమ రంగాల్లో రాణిస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 శ్రవణం, ధనిష్ట 1) ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం జాగ్రత్త, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుంభం (ధనిష్ట 3, 4 శతభిషం, పూర్వాభాద్ర 1, 2 ౩) ఉద్యోగంలో మీ (శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు (శ్రమ మీద సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. వాగ్వాదాలకు అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర ఓ ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు బాగా ఆదరిస్తారు. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉ౦టాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్టాయిలో లాభాలు ఆర్టిస్తారు. కుటుంబంలో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి. సంతానం పురోగతి సాధిస్తారు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.