మేషం (Aries)(అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగానికి సంబంధించి దూర ప్రాంతం నుంచి మంచి అఫర్ వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో విహారం చేస్తారు.
వృషభం (Taurus)(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా పుంజుకుంటారు. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్ధులకు పరవాలేదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితురాలితో తిరుగుతారు.
మిథునం(Taurus)(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త, ప్రేమ వ్యవహారాలు మానసిక ఒత్తిడినిస్తాయి. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు.
సింహం (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1) శుభకార్యం తల పెడతారు. స్థాన చలనం సంభవం. సమయం అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఒక పట్టాన పెళ్లి సంబంధం కుదరదు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. రుణ బాధ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్ధులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
కన్య (Virgo)(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. అర్థిక సమన్యలు ఎదురవుతాయి. వ్యాపార, స్వయం ఉపాధి రంగాలవారికి బాగుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాలలో పాల్గొంటారు. సంతానం నుంచి శుభ వార్త వింటారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందగిస్తాయి.
తుల (Libra)(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్థాన చలన సూచనలున్నాయి. బంధువులతో విభేదిస్తారు.కొత్త ఫ్లాట్ కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
వృశ్చికం (Scorpio)(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్దులకు పరవాలేదు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
ధనస్సు (Sagittarius)(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్ళి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. దూరపు బంధువులు దగ్గరవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
మకరం (Capricorn)(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఇప్పుడున్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒకపట్టాన ముందుకు వెళ్లవు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. విద్యార్ధులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ము౦దంజ వేస్తారు.
కుంభం (Aquarius)(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆర్థిక, వ్యాపార రంగాలవారికి బాగుంది. భాగస్వాములతో విభేదాలు పరిష్కారమవుతాయి. రుణాలుతీరుస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. విద్యార్ధులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదానికి సంబంధించిన కోర్టు కేసులో నెగ్గుతారు. ఆదాయం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) చక్కని ఆర్థిక ప్రయోజనాలతో ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తల పెట్టిన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులకు బాగుంది.