వృషభ రాశి (Taurus): ఆశించినంతగా వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదనిపిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త ఆదాయ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.
మిథున రాశి (Gemini): ఒకటి రెండు కొత్త ఉద్యోగావకాశాలు మీ ముందుకు వస్తాయి. వివాహానికి శుభ సమయం ఇది. ఆర్థికపరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. బంధువర్గంలో గౌరవపురస్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు శ్రమ పడక తప్పదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.
కర్కాటక రాశి (Cancer): ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సింహ రాశి (Leo): ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగం విషయంలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల్ని సామర్ధ్యంతో మెప్పిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కొన్ని అవాంతరాలున్నా అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. దగ్గరి బంధువులతో విభేదాలకు అవకాశం ఉంది. శక్తికి మించి శ్రమ పడి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. హామీలు ఉండొద్దు.
కన్య రాశి (Virgo): అన్నివిధాలా సమయం బాగుంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలోలాభాలకు ఆస్కారముంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి (Scorpio): ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. సంతానం నుంచి శుభ వార్త వింటారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యార్ధులకు బాగుంది.
ధనస్సు రాశి (Sagittarius): ఆర్థిక సంబంధమైన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇ౦టా బయటా కొద్దిగా ఒత్తిడి తప్పదు. ఆదాయానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొన్ని ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్ధులకు అన్ని విధాలా అనుకూలంగా ఉ౦ది. పనుల్లో తిప్పట ఎక్కువగా ఉంటుంది.
మకర రాశి (Capricorn): గ్రహ సంచారం కొద్దిగా అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. గృహ, వాహన యోగాల మీద దృష్టి పెడతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
మీన రాశి (Pisces): ఆశించిన విధంగా మంచి ఉద్యోగం వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రతిదీ అలోచించి చేయండి. ప్రణాళికాబద్దంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. సహోద్యోగుల సహకారం కూడా తీసుకోండి. కోపతాపాలకు ఇది సమయం కాదు. బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి.