Horoscope Daily: ప్రతివారంలో సోమవారంతో వారం మొదలవుతుంది. అందువల్ల చాలా మంది ఎన్నో కార్యక్రమాలను సోమవారం ప్రారంభించేందుకు సిద్ధపడతారు. పైగా సోమవారం ఎంతో శ్రేష్టమైనది. ఈ రోజున ఏ కార్యక్రమాలు తలపెట్టినా మంచి జరుగుతుందని ప్రతీతి. మరి ఇవాళ నక్షత్ర రాశులు ఏం సూచిస్తున్నాయి... సూర్య గమనం ఎలా సాగుతోంది... గ్రహాల కదలికల వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలగబోతోంది... తిథి, పంచాంగం, కాలం ఏం చెబుతున్నాయి... ఇలాంటి విషయాల్ని లెక్కలోకి తీసుకొని జ్యోతిష పండితులు ఎలాంటి రాశి ఫలాలు ఇస్తున్నారో తెలుసుకుందాం. ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయో చూద్దాం.
మేష రాశి (Aries) (March 21-April 20): ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. అనుకున్నవి సాధిస్తారు. సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఖర్చులు పెరిగినా... ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. మిత్రులు సహాయంగా ఉంటారు. శుభవార్త వింటారు. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది.
వృషభ రాశి (Taurus) (April 21-May 20): ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.
మిథున రాశి (Gemini) (May 21-Jun 21): అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. బంధువుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
కర్కాటక రాశి (Cancer) (Jun 22-July 22): ఇంటి సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. వ్యాపారులకు కలిసి వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి (Leo) (July 23-August 23): శుభ సమయం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ వల్ల సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
కన్య రాశి (Virgo) (August 24-September 23): ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది.
తుల రాశి (Libra) (September 24-October 23): ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio) (October 24-November 22): ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. అధికారులతో సామరస్యంగా వ్యవహరించండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు.
ధనస్సు రాశి (Sagittarius) (November 23-December 21): గట్టిగా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. వ్యాపారంలో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పిల్లలు శుభవార్త మోసుకొస్తారు.
మకర రాశి (Capricorn) (December 22-January 21): ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.
కుంభ రాశి (Aquarius) (January 22-February 19): ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అనుభవానికి వస్తాయి. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి అభివృద్ధి కనిపిస్తోంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్యను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులు సత్ఫలితాలు పొందుతారు.
మీన రాశి (Pisces) (February 20-March 20): ఉద్యోగంలో అధికార లాభం ఉంది. శుభవార్త వింటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు. మంచి కుటుంబంలో వివాహ సంబంధం కుదురుతుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.