Som Pradosh Vrat in July 2022: సాధారణంగా పరమ శివుడు విలక్షణ దైవం. ఆయన్ను భక్త సులభుడు అని చెబుతారు. ఎందుకంటే కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయనను భోళాశంకరుడు అని కూడా అంటారు. ఆడంబరాలకు ఆయన దూరం. ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి.. మారేడు పత్రాలతో పూజచేస్తే పరవశించి పోయి.. కరుణ చూపే దైవం.
ముఖ్యంగా సోమవరాం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన దినం.. ఈ రోజున శరణంటూ పూజలు చేసిన వారిని అనుగ్రహించి, అభయమిచ్చి, కష్టాలను నెరవేర్చే మహాదేవుడు శంకరుడు. ఓం నమ: శివాయ అను పంచాక్షరి మంత్రాని జపించి, మన:స్పూర్తిగా పరమ శివున్ని ధ్యానిస్తే ఆయన అనుగ్రహం ఎల్లవేళల మనకు అండగా ఉంటుంది. శివపూజకు పెద్దగా ఆర్బాటాలు అవసరం లేదు.
ఇదే రోజున 4 శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అవే సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, శుక్ల యోగం, బ్రహ్మ యోగం. పంచాంగం ప్రకారం ఈ రోజున అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉంటాయి. ఇన్ని ఏర్పడుతున్నాయి కాబట్టి జూలై 11కు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజు శుభకార్యాలకు చాలా మంచిది. సోమ ప్రదోష వ్రతం రోజు శుభ సమయం సాయంత్రం 07.22 గంటల నుండి రాత్రి 09:24 గంటల వరకు ఉంది.
ప్రదోష వ్రత కథ తరువాత శివ చాలీసా పఠించాలి.. చివరగా పరమేశ్వరుడికి హారతి ఇచ్చి పూజను పూర్తి చేస్తే చాలా మంచిది అంటున్నారు. ఈ రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇలా చేయడంతో శివుడి అనుగ్రహం పొంది.. ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యల నుంచి బయట పడి.. మనశ్సాంతి లభిస్తుంది అంటున్నారు.