Today Horoscope: నేడు శుక్రవారం ( సెప్లెంబర్ 05) .. ఇవాళ ఎలాంటి ఫలాలు ఉంటాయి. ఏదైనా ముఖ్య కార్యక్రమం చేపట్టడానికి సరైనా రోజా కాదా..? ఇలా ఏ రోజుకు ఆ రోజు తమ లక్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందిలో ఉంటుంది. అలాంటి వారి కోసం ధిన ఫలాలు అందిస్తోంది న్యూస్ 18 నెట్ వర్క్.. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో.. దిన ఫలాల ద్వారా తెలుసుకుందాం.
మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. సహచరులు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.
మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో బాగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంటి సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితా లనిస్తాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది.. కానీ ఖర్చులు పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. మధ్య మధ్య చికాకులు, అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. కొంత వరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు పరవాలేదు. మీకు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.
సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా లాభ దాయకంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానపరంగా శుభవార్త వింటారు. అనుకున్న ప నులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కోర్టు కేసులో నెగ్గుతారు. ఆకస్మిక ప్ర యాణాలున్నాయి.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలందుతాయి. ప్రయాణ లాభం ఉంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం పరవాలేదు. తల పెట్టిన పను లు పూర్తవుతాయి.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) అనుకున్న పనులు శ్రమ మీద పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. సొంత నిర్ణయాలతో ధైర్యంగా ముందడుగు వేయండి. ఆరోగ్యం విష యంలో జాగ్రత్త.
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. పెళ్లికి సంబంధించి శుభ వార్త వింటారు. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ఆరోగ్యం పరవాలేదు. సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో మార్పునకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో మరింతగా శ్రద్ధ పెంచాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా ప్రయోజనం జరుగుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోండి. ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. మధ్య మధ్య ఏదో ఒక అనారోగ్యం చికాకు పెడుతుంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. అదృష్ట యోగం పట్టబోతోంది. అవసరాలకు తగ్గట్టు డబ్బు చేతికి అందుతుంది. తల పెట్టిన పనులు పూర్తవుతాయి.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆర్థిక లాభానికి అవకాశం ఉంది. కొన్ని బాకీలు వసూలువుతాయి. ఇబ్బందుల్లో ఉన్న బంధువులను ఆదుకుంటారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.
మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల కారణంగా లాభపడతారు. ఇప్పుడు మంచి పనులు తలపెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. హామీలు ఉండొద్దు.