ఉత్సాహంతో రాబోయే వారం కోసం ఎదురు చూస్తున్నారా? మీ ఉత్సాహాన్ని పెరిగేలా.. ఈ వారం ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకోండి. మార్చి 14 నుంచి 20 వరకు ఆయా రాశులవారికి ఎదురయ్యే పరిస్థితులు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 13
మేషరాశి ఇది మీకు ఆర్థికంగా అనుకూలమైన సమయం. అయితే బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులపై నిఘా ఉంచండి. వివాహమైనా, రిలేషన్లో ఉన్నా మీ ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినకండి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 13
వృషభం అనవసరమైన వస్తువులను కొనకండి, డబ్బు ఆదా చేయండి. ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో చిన్న వాదన జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 13
మిథునరాశి ప్రశాంతంగా ఉండండి, అనవసరమైన తగాదాలు, వాదనలకు దిగకండి. పని ప్రారంభించే ముందు సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీ భాగస్వామి స్వేచ్ఛను గుర్తిస్తే సమస్యలు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 13
కర్కాటకం మీ సహోద్యోగి మీ సహనాన్ని పరీక్షించవచ్చు.. ఇక్కడే మీరు ప్రశాంతంగా ఉండాలి. కొంచెం నీరు తాగి ఆ విషయాన్ని పట్టించుకోకండి. మీకు వ్యతిరేకంగా పనిచేసే శత్రువులు ఉండవచ్చు. కానీ వారు మీకు ఎలాంటి నష్టం కలిగించలేరు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 13
సింహ రాశి మీ కెరీర్, రిలేషన్ షిప్, ఆర్థికపరమైన అంశాలు అన్నీ సర్దుకున్నాయి. అయితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. బయట ఆహారం తినకండి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 13
కన్య మీరు పనిలో కొంచెం కష్టపడవలసి ఉంటుంది. కానీ మీరు అన్నింటినీ సక్రమంగా పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు చాలా మంచివారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 13
* తుల మీ వైఖరి ఈ వారం కఠినమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు మీ సహోద్యోగికి వ్యతిరేకంగా మారవచ్చు. ప్రశాంతంగా ఉండండి, విషయాలను సరిదిద్దడానికి ఒక నెల సమయం పట్టినప్పటికీ ఓపికగా పని చేయండి. వ్యాయామం చేసినంత కాలం ఆరోగ్యం బాగుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 13
వృశ్చికరాశి మీరు వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితానికి సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు. మీరు కొన్ని ఫ్రీలాన్సింగ్ అవకాశాలను పొందవచ్చు సక్రమంగా అంచనా వేసి అంగీకరించండి. చిన్నపాటి జలుబు వస్తుంది, హోలీ వేడుకల్లో అప్రమత్తంగా ఉండండి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 13
ధనుస్సు మీ ఆర్థిక పరిస్థితి బాగుంది. కానీ రోజువారీ ఖర్చులపై దృష్టి పెట్టడం అవసరం. కొన్ని అర్థం లేని వాదనల కారణంగా ప్రేమ జీవితం దెబ్బతింటుంది. ఆరోగ్యం బబాగుంటుంది. కానీ కొద్దిపాటి ఒత్తిడి నిద్రలేని రాత్రులకు కారణమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 13
మకర రాశి మీరు మంచి ప్రాజెక్ట్‌లలో పని చేస్తారు. పనికి సంబంధించి సంతృప్తి పొందుతారు. ఇంట్లో ఎవ్వరితోనూ నోరు జారకండి.. అవసరమైన వాదనకు దారితీయవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 13
కుంభ రాశి మీ సహోద్యోగి వైఖరిపై కోపం ప్రదర్శించకండి. ప్రశాంతంగా ఉండండి . అతని/ఆమె ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బయట విక్రయించే ఆహారం తీసుకోకండి. ప్రేమ జీవితం బాగుంది. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 13
మీనరాశి మీరు భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండాలి. ఏదైనా మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఉంది. ఈవారంపాటు మీకు సమస్యలను తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి. శ్రద్ధగా పని చేసి పరిస్థితుల నుంచి బయటపడండి. (ప్రతీకాత్మక చిత్రం)