Vastu Tips: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల అలాంటి ఇళ్లకే ఎక్కువగా డిమాండ్ కనిపిస్తోంది. ఈ రోజుల్లో ప్రతి మినిషి.. పెద్దదో.. చిన్నదో ఏదో ఒక సొంత ఇళ్లు అంటూ ఉండాలని ఆశపడుతున్నారు. అయితే ఇండివిడ్యువల్ హౌస్ అయినా..? లేదా అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ అయినా.. ఇలా ఉంటేనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లేదంటే వాటివైపే చూడడం లేదు. దీంతో ఇప్పటికే కట్టినవి అలానే ఖాళీగానే ఉంటున్నాయి అంటున్న బిల్డర్లు..
వినియోగ దారుల కోరిక బట్టి.. వాస్తు పక్కాగా ఉండేలా ఇళ్లు కడితేనే కొంటున్నారని చెబుతున్నారు. ఎందుకంటే ఇంటి వాస్తు సరిగ్గా లేకుంటే కుటుంబంలో గానీ, వ్యక్తుల జీవితాల్లో కానీ చాలా రకాల సమస్యలు వస్తాయి. వాస్తు కోపం కారణంగా చాలామందిలో ఆర్థిక సమస్యలతో పాటు మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇక ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉండడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు, సానుకూలత ఉంటుందని వాస్తు శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. ఐశ్వర్యానికి అధిదేవత అయిన కుబేరుని విగ్రహం లేదా ఫోటో ఉత్తరం దిక్కున పెడితే భవిష్యత్తులో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు.
అసలు వాస్తు ప్రకారం ఇళ్లు లేకపోతే ఎవరూ వాటిని కొనడానికి ఇష్టపడడం లేదు. చాలామంది ప్రత్యేకంగా వాస్తు సలహాలు తీసుకున్న తరువాతే.. ఇంటిని చూడడానికి వెళ్తున్నారు. అయితే వినియోగదారుల డిమాండ్ ఇప్పటికే తెలియంతో బిల్డర్లు సైతం పక్కా వాస్తు పాటిస్తున్నారు. ఆల్ రెడీ కట్టినవి ఉంటే చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు.