వృశ్చిక రాశి (Scorpio) వృశ్చిక రాశి వారు నీటి రాశి వారు. వీరికి ఎమోషన్స్ బాగా ఉంటాయి. వీరు పగలంతా తమ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల్ని గమనిస్తూ ఉంటారు. వీళ్లు చూసేది మిగతా వాళ్లు చూడలేరు. అంటే వీరు చూసే కోణం వేరుగా ఉంటుంది. ఇలా పగలంతా రకరకాల పరిస్థితులను చూసి... రాత్రిళ్లు వాటి గురించి లోతుగా ఆలోచిస్తారు. వ్యక్తులు, పరిణామాలను విశ్లేషించుకుంటారు. సెన్సిటివ్ వ్యక్తులు కావడం వల్ల... దేన్నీ త్వరగా మర్చిపోలేక... త్వరగా నిద్రపోరు.
ఓ షెడ్యూల్ అంటూ లేకపోవడంతో... వీరికి పగటి వేళ చాలా పనులు పెండింగ్ పడుతుంటాయి. అవి తప్పనిసరిగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇక ఆ పనిలో పడి రాత్రి పొద్దుపోతున్నా... చేస్తూనే ఉంటారు. దాంతో నిద్రపోయే టైమ్ దొరకదు. తెల్లవారు జాము టైమ్లో పడుకున్నా... తెల్లారే లేచి... మళ్లీ పనులపై పడాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)