కర్కాటకం-మీనం (Capricorn-Pisces): కర్కాటకం రాశి వారికి ఓపిక, ఎటువంటి పరిస్థితుల్లోనైనా చెక్కు చెదరకుండా ఆత్మ విశ్వాసంతో ఉంటారు. ఈ రాశి వారు గొప్ప పేరెంట్స్‌గా ఉండగలరు. మీన రాశి వారు స్థిర ఆలోచనలతో ఉండకపోయినా... తమ ఎమోషన్స్‌ను బయట పెట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. వీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంతో పాటు ఎప్పుడూ అభినందించుకుంటూ ఉంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు-మిధునం (Sagittarius-Gemini): ధనుస్సు-మిధునం (Sagittarius-Gemini): ఈ రెండు రాశుల వారిని ఎయిర్-ఫైర్ కాంబినేషన్‌గా భావిస్తారు. కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఈ రెండు రాశుల వారికి ఆసక్తి ఎక్కువ. ధనస్సు రాశి వారికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటే... మిధున రాశి వారు పరిస్థితులకు అభిప్రాయాలను మార్చుకుంటారు. దాంతో వీరి మధ్య సఖ్యత ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మిధునం-కుంభం (Gemini-Aquarius): కుంభ రాశి వారు స్థిరంగా ఉంటారు. మిధున రాశి వారు వీరికి వ్యతిరేకంగా ప్రవహించే నదిలా ఉంటారు. అంతేకాకుండా మిధున రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో కుంభరాశి వారు ఎప్పుడూ సహాయపడతారు. ఒకరిని ఒకరు మెచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. దాంతో ఈ రాశుల కాంబినేషన్లో ఉన్న పేరెంట్స్-పిల్లలు సఖ్యతతో ఉంటారు.(ప్రతీకాత్మక చిత్రం)