కర్కాటక రాశి : కర్కాటక రాశి వ్యక్తులు తమ స్నేహితులు, బంధువులకు చాలా త్వరగా, ఎక్కువగా అటాచ్ అవుతారు. వీరు తమ స్నేహితులకు అంటిపెట్టుకుని ఉంటారు. ఈ రాశివారు రోజులో కనీసం నాలుగైదు సార్లయినా ఫ్రెండ్స్‌కి ఫోన్లు చేస్తారు. తరచుగా టెక్స్ట్ మెసేజ్‌లు పంపిస్తారు. అయితే ఇవన్నీ కూడా అవతలి ఫ్రెండ్స్‌కి బాగా విసుగు తెప్పించవచ్చు. ఈ కారణంగా ఫ్రెండ్స్ వీరితో మాట్లాడే ఇంట్రెస్ట్‌ను పూర్తిగా కోల్పోవచ్చు. ఆ విధంగా ఫ్రెండ్స్ కర్కాటక రాశి వ్యక్తులను దూరంగా ఉంచవచ్చు.
తులారాశి : అతిగా ఆలోచించే మనస్తత్వం తులారాశి వారిది. వీరు ఆలోచనల్లో పడిపోయి అన్ని ప్రణాళికలు మర్చిపోతుంటారు. ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన పార్టీ ప్లాన్స్‌ను కూడా వీరు గుర్తుంచుకోరు. అందుకే స్నేహితులకు వీరిపై బాగా కోపం వస్తుంది. ఈ కారణంగానే ఫ్రెండ్స్ సర్కిల్ వీరిని నిర్లక్ష్యం చేస్తుంది. వీరు ఎక్కువగా ఆలోచనల్లో ఉండి ఏమీ పట్టించుకోరు కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కోసారి వీరిని అవసరం ఉన్నప్పుడు తమకు అనుగుణంగా వాడుకొని, ఆ తర్వాత పక్కన పెట్టేస్తారు.
వృషభరాశి : వృషభరాశి వ్యక్తులు ఎవరూ భరించలేనంత సోమరితనంతో ఉంటారు. వీరు తమ ఇళ్లను వదిలి అసలు బయటకు రారు. దీనివల్ల ఫ్రెండ్స్ చేసే ప్లాన్స్‌లో వీరు అంత ఎక్కువగా భాగస్వామ్యం కారు. ఎటూ వెళ్లకుండా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇలా వీరు తమ సొంత లోకంలో జీవించడం వల్ల ఫ్రెండ్స్ అనేవారు వీరిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేస్తారు. వీరి స్వభావం ఫ్రెండ్స్‌కి బాగా చిరాకు తెప్పిస్తుంది.
మీనరాశి : ఎవరైనా సరే తమకు అందరి నుంచి కాస్త ప్రైవసీ కావాలని కోరుకుంటారు. ఈ కాస్త ప్రైవసీని ఎవరైనా హరించాలని చూస్తే మాత్రం వారికి అస్సలు నచ్చదు. అయితే మీనరాశి వ్యక్తులు ఇతరులు ప్రైవసీ కోరుకుంటున్నారనే విషయాన్ని ఎప్పటికీ గ్రహించలేరు. వీరు తమ ఫ్రెండ్స్ ప్రైవసీకి భంగం కలిగిస్తారు. ఈ చెడు లక్షణం కారణంగానే వీరిని మాట్లాడడానికి, కలవడానికి ఫ్రెండ్స్ ఎక్కువ ఆసక్తి చూపించరు.