Horoscope today: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. ఇవి ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... వారి రాశి ఫలాలపై మంచి, చెడు ఫలితాలు ప్రభావం చూపుతాయి. మంచి జరిగే అవకాశం ఉంటే... ఆనందమే. అదే చెడు జరిగే అవకాశం ఉంటే... అప్రమత్తం అవ్వాలి. మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో అలర్ట్గా ఉండాలి. అలా మనల్ని అప్రమత్తం చెయ్యడంలో రాశిఫలాలు ఉపయోగపడతాయి. మరి 11-11-2021 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో చూడండి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. పొదుపు చర్యలు చేపడతారు. వ్యాపారంలో బాగా లబ్ధి పొందుతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో శుభ వార్తలు వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెడతారు. సహచరులు, సన్నిహితులతో వాదనలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్నప్పటి స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యం తల పెడతారు. సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆటంకాలు ఎదురవుతున్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆదాయానికి ఏమాత్రం కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. రుణ సమస్యల రుణ సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. శరీరానికి విశ్రాంతి అవసరం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. శుభ కార్యం తల పెడతారు. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఏలిన్నాటి శని కారణంగా పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. రాదనుకున్న డబ్బు అనుకోని విధంగా చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. వివాహ సంబంధం కుదరవచ్చు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఇతరులకు ఆర్థికంగా వీలైనంత సహాయం చేస్తారు.