మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) మిధున రాశి వారు... లేవడంతోనే మొబైల్ చూసుకుంటారు. వారి రోజు మొబైల్‌తోనే మొదలవుతుంది. వీరి సోషల్ మీడియాతో బాగా కనెక్ట్ అవుతారు. తమ ఆసక్తిని, విషయాలనూ సోషల్ మీడియాలో ఇతరులకు చెప్పడం వీరికి చాలా ఇష్టం. లైక్స్, కామెంట్స్ ఇష్టపడతారు. చాటింగ్ అంటే కూడా వీరికి ఇష్టమే. తాము చేసే పనులపై ఇతరులతో ముచ్చట్లు పెట్టుకోవడం వీరికి ఇష్టం. ఏదైనా గ్రూపు చాటింగ్‌లో వీరు ఉంటే... మిగతా వారి కంటే వీరే ఎక్కువగా స్పందిస్తారు. ప్రతి అంశాన్నీ వివరంగా చెబుతూ... అవతలి వారిని తమ చాటింగ్‌లో పడేయగలరు. అలా టైమ్ తెలియనివ్వకుండా చేస్తారు.