లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది వ్రతాలు, ఉపవాసం, పూజలు చేస్తుంటారు. ఇన్ని చేసిన కొంత మంది లక్ష్మిదేవి (Goddess Laxmi) అనుగ్రహాన్ని పొందలేరు. కానీ కొందరిపై ఆ దేవత అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరికి జీవితంలో దేనికి లోటు ఉండదు. అయితే అలా లైఫ్ మెుత్తం లక్ష్మిదేవి అనుగ్రహం పొందే రాశుల గురించి మీకు తెలుసా..? అందులో మీరు ఉన్నారా..?
మిథునం (Gemini) - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశివారు చాలా సంతోషంగా ఉంటారు. దానికి ప్రధన కారణం వీరిపై లక్ష్మిదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే వీరికి ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఈ వ్యక్తులు కష్టపడి పనిచేస్తారు.. అలాగే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
తుల రాశి (Libra) - తులారాశిలో పుట్టిన వారిలో ఎక్కువమంది మొదటి చూపులోనే ఎవరినైనా ఆకర్షిస్తారు. ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు. లక్ష్మిదేవి అనుగ్రహం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి ఇతరుల కంటే మెరుగ్గా ఉంటుంది. వీరి జీవితం ఎప్పుడూ ఆనందంతో నిండి ఉంటుంది. అలాగే ఒకవేళ ఆర్థిక సమస్యలు వచ్చినా.. త్వరగా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)- ధనుస్సు రాశివారు ప్రతి పనిలోనూ చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. ఇతరులతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులైనా.. ఉద్యోగస్తులైనా మంచి గుర్తింపు పొందుతారు. అంతే కాదు, వారి వర్కింగ్ స్టైల్ కారణంగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. వీరికి ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఈ వ్యక్తులు లక్ష్మీదేవి అనుగ్రహంతో చాలా డబ్బు సంపాదిస్తారు.
లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునే వారు.. శుక్రవారం లక్ష్మిదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు , ఐశ్వర్యం, ఆస్తి, వైభవం మొదలైనవి వృద్ధి చెందుతాయి. లక్ష్మి దేవి అనుగ్రహం పొందిన వారు ఆర్థిక సంక్షోభం, పేదరికం, వైఫల్యం మొదలైన వాటిని ఎప్పుడూ ఎదుర్కోరు. లక్ష్మి చంచల, ఒకే చోట స్థిరంగా ఉండదు కాబట్టి ఎవరైనా కొంత సమయం వరకు డబ్బును కలిగి ఉంటారు. మరికొంత సమయం అది ఖర్చు అయితపోతుంది.
శుక్రవారం ఉదయం స్నానం తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీ దేవిని తామర పువ్వులు లేదా ఎర్ర గులాబీలతో పూజించండి. పూజ సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మి మాత అనుగ్రహం లభిస్తుంది.
శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఈ పారాయణం అపారమైన సంపదల కోసం చేస్తారు.