కన్యరాశి: ఈ రాశి వారు నలుగురిలో ఉన్నారంటే.. ఇక తన మాటే శాసనం.. నేను చెప్పిందే వినాలి అని భావిస్తారు. తన తప్పు ఉందంటే.. ఒప్పుకోకపోవడం వారి స్వభావం. ఎదటి వారు పొగుడ్తుంటే.. ఆకాశంలో విహరించినంత సంతోషంలో ఉంటారు. ఎక్కువగా ఎదుటి వారి నుంచి ప్రశంసలు పొందడానికి ట్రై చేస్తారు. అయితే, ఈ రాశి వారితో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
వృశ్చికం : ఈ రాశి వారు ఎప్పుడూ ఇతరులను తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తారు. దీని కోసం వారు ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. మీరు వారి మాటలను పట్టించుకోవద్దని భావించినా.. వారితో శత్రుత్వం పెంచుకోవడానికి ప్రయత్నించినా.. జనాల్లో మిమ్మల్ని పిచ్చివాళ్లను చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ దిశలో ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టరు. అందుకని ఇలాంటి వారితో గొడవ పడకపోవడమే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
కుంభం: ఈ రాశి వారు ఎవరినీ తమకంటే ఉన్నతంగా చూడలేరు. ఇతరులను చూసి చాలా అసూయపడతారు. ఎవరైనా తమ కంటే గొప్పవారైతే, వారిలోని లోపాలను లెక్కించడం ప్రారంభిస్తారు. మైండ్ గేమ్‌ల విషయంలో ఈ వ్యక్తులు మాస్టర్స్. ఎవరితోనైనా ఘర్షణకు దిగితే.. వారికి సరైన గుణపాఠం చెప్పి ఊపిరి పీల్చుకుంటారు. ఈ రాశి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే.