సమస్యల్ని సవాలుగా తీసుకొని... లాజికల్‌గా పరీక్షించగలగాలి. మన ఆలోచనలు, ఎమోషన్లను కంట్రోల్ చేసుకోగలగాలి. అలా చేసేవారు సక్సెస్ అవుతారు. రాశుల ఆధారంగా జ్యోతిషులు... ఏ రాశి వారు మానసికంగా బలంగా ఉంటారో లెక్కలేశారు. ఆ రాశులేవో తెలుసుకుందాం. ఈ జాబితాలో లేనంత మాత్రాన మానసికంగా బలంగా ఉండరని కాదు... ప్రాక్టీస్‌తో ఎవరైనా స్ట్రాంగ్ కాగలరు.
వృషభం (Taurus) : వృషభ రాశి వారు మిగతా అన్ని రాశుల వారి కంటే మానసికంగా ధృఢంగా ఉంటారట. వీళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏమాత్రం షేక్ అవ్వకుండా స్థిరంగా నిశ్చలంగా ఉండగలరట. వీళ్లు వాస్తవాలకు దగ్గరగా ఉండే నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక... ఇక దాని నుంచి అంత తేలిగ్గా వెనక్కు తగ్గరు. మిగతా వాళ్లను కలుపుకొనిపోవడంలోనూ వీళ్లకు వీళ్లే సాటి. వీళ్లను మెంటల్ డిస్టర్బ్ చెయ్యడం చాలా కష్టం. అలాంటి వీళ్లు కూడా డిస్టర్బ్ అయితే... ఇక అక్కడి పరిస్థితి అత్యంత దారుణంగానే ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు.
మిథునం (Gemini) : మిధున రాశివారు... ఈ ప్రపంచాన్ని వేరే కోణంలో చూస్తారు. ఈ రాశి వారిలో రెండు పర్సనాల్టీలు ఉంటాయి. ఏదైనా విషయాన్ని మిగతా అందరూ తప్పు అంటే... మిధున రాశి వారు వెంటనే ఒప్పుకోరు. వీరు ఎందుకు తప్పు, నిజంగా తప్పేనా అనే యాంగిల్స్ కూడా పరిశీలిస్తారు. అదృష్టమేంటంటే... అలా రెండు కోణాల్లో ఆలోచించడంలో వీళ్లకు అదిరిపోయే స్కిల్ ఉంటుంది. అందువల్ల వీళ్లు వెంటనే ఏదో ఒక వైపు బెండ్ అవ్వరు. మెంటల్‌గా బలంగా ఉంటూ... తమ అనుభవంతో ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. వీరికి మానసిక సామర్ధ్యం చాలా లోతుగా ఉంటుంది. అందువల్ల మిధున రాశి వారు అంత ఈజీగా నిగ్రహం కోల్పోరు.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశివారు సున్నిత మనస్కులు. ప్రతి దానితో ఎమోషనల్ బాండ్ కలిగి ఉంటారు. సెంటిమెంట్లకు కనెక్ట్ అవుతారు. ఐతే... మానసిక స్థిరత్వం విషయంలో మాత్రం వీళ్లు పాజిటివ్‌గా ఉంటారు. వీళ్లకు లోతుగా ఆలోచించే సామర్ధ్యం ఉంటుంది. వీళ్లు తమ ఫీలింగ్స్ దాచుకోవాలనుకోరు. బయటపెట్టడానికి వెనకాడరు. ఎందుకంటే... ఆ ఫీలింగ్సే... మనిషిని బలంగా ఉంచుతాయని వీళ్లు నమ్ముతారు. ఒక్కోసారి వీళ్లు వెనక్కి తగ్గడానికి కూడా వెనకాడరు. ఐతే... వెనక్కి తగ్గినా, ముందుకి వెళ్లినా... ఆ పరిస్థితుల్లో వీళ్లు పరిణామాల్ని బాగా విశ్లేషించగలరు. అందువల్ల ఫైనల్‌గా వీళ్లు పరిస్థితులను ఆరోగ్యకరంగా మార్చేయగలరు.
సింహం (Leo) : సింహ రాశివారిని మిగతా రాశుల్లో స్టార్స్‌గా భావిస్తారు. అలా భావించడానికి కారణం ఉంది. వీళ్లకు ఉన్న మానసిక సామర్థ్యం మామూలుది కాదు. వీళ్లు మిగతా వాళ్లతో ఏదైనా విషయం డీల్ చేసేటప్పుడు... తమ మానసిక సామర్ధ్యంతో... అవతలి వాళ్లను తమవైపు తిప్పేసుకోగలరు. వీళ్లు ఎప్పుడూ టాప్ పొజిషన్‌నే ఇష్టపడతారు. అక్కడే ఉండాలనుకుంటారు. అందువల్ల ఏ పరిస్థితుల్లోనైనా వీళ్లు ఆ దిశగా బలమైన ప్రయత్నాలుచేస్తారు. తమ సామర్థ్యం మొత్తం వాడుతారు. ఏదైనా సరే ది బెస్ట్ అన్నదే వీరి మైండ్ కోరుకుంటుంది. కొంత మంది సింహ రాశి వారిని చూసి... వీళ్లకు పొగరు ఎక్కువ అనే అభిప్రాయానికి వచ్చే లోపే... తమ సామర్థ్యంతో ఈ రాశి వారు... వాళ్లను కూడా తమవైపుకి లాగేసుకొని... తామే రైట్ అని అనుకునేలా చేయగలరు.
తుల (Libra) : తుల రాశి వారు పేరుకు తగ్గట్టే... ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో తమ జీవితంలో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటారు. వీళ్లకు మానసిక సామర్థ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే... ప్రతి దాన్నీ వీళ్లు సరైన ఆర్డర్లో పెట్టేసుకోగలరు. తమ చుట్టూ ఉన్న పరిస్థితులను తమకు పూర్తిగా అనుకూలంగా లేదా పూర్తిగా వ్యతిరేకంగా లేకుండా సరిగ్గా సమానంగా ఉండేలా చేసుకుంటారు. తాము చేసే పనుల విషయంలో ఈ రాశి వారు చాలా కచ్చితత్వంతో, తామే కరెక్ట్ అనే యాంగిల్లో ఉంటారు. ఇందుకోసం వీళ్లు అత్యంత ఎక్కువ సహనాన్ని ప్రదర్శించగలరు. ఫలితంగా పరిస్థితులు వీళ్లకు బ్యాలెన్స్‌గా మారతాయి. మరో అదృష్టమేంటంటే... వీళ్లు అందరితోనూ కలుపుగోలుగా ఉండగలరు. ఈ లక్షణం వీళ్లను కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేయగలదు.
వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశి వారు చాలా పవర్ఫుల్. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఇక అది మార్చుకోరు. మాగ్జిమం దానిపైనే స్థిరంగా ఉంటారు. వీళ్లకు ఓ ప్లస్ పాయింట్ ఉంది. వీళ్లు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, డీల్ కుదుర్చుకునేటప్పుడు... అవతలి వాళ్ల మనసులో ఏముందో గ్రహించేయగలరు. అందువల్ల సవాళ్లను, కష్టమైన పరిస్థితులను వీళ్లు తేలిగ్గా డీల్ చేసేసుకుంటారు. ఈ లోపలి మనస్తత్వాల్ని గ్రహించే గుణం వీళ్లను విపత్కర పరిస్థితుల్లో పై చేయి సాధించేలా చేస్తుంది. చివరకు వీళ్లు వేళ్లే దారి, తీసుకునే నిర్ణయం, చేసే పని, చెప్పే మాటలను మిగతా వారు మెచ్చుకునే పరిస్థితి ఉంటుంది.