THESE ZODIAC SIGNS 2022 THINGS TO NOT DO IN 2022 AS PER YOUR ZODIAC SIGN DETAILS HERE GH VB
Zodiac Signs-Astrology: ఈ రాశుల వారు ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు.. వీటిలో మీరూ ఉన్నారేమో చూసుకోండి..
ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం నాడు మనం సరికొత్త తీర్మానం చేసుకుంటాం. కొందరు మాత్రమే వాటిలో విజయం సాధించగలుగుతారు. మరికొందరు ఘోరంగా విఫలమవుతారు. కొన్ని విషయాల్లో మన కొత్త వెర్షన్ను సృష్టించుకోవడం భయపెడుతుంది, ఆశ్చర్యపరుస్తుంది కూడా.
ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం నాడు మనం సరికొత్త తీర్మానం చేసుకుంటాం. కొందరు మాత్రమే వాటిలో విజయం సాధించగలుగుతారు. మరికొందరు ఘోరంగా విఫలమవుతారు. కొన్ని విషయాల్లో మన కొత్త వెర్షన్ను సృష్టించుకోవడం భయపెడుతుంది, ఆశ్చర్యపరుస్తుంది కూడా. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 14
మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఎంతోమంది జీవితాలు గతి తప్పాయి. అయితే ఆశాభావంతో ముందుకు సాగాలి. కానీ గ్రహరాశులను బట్టి ఈ పనులు ఈ ఏడాది చేయకపోవడం మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 14
మేషం: మీ గతం లేదా మీ పొరపాట్లు మీకు అడ్డంకి కాకుండా చూసుకోండి. మీరు నేర్చుకున్న ప్రతి విషయాన్ని గ్రహిస్తూ ముందుకు సాగండి. విజయం, సంతృప్తి మీ చుట్టుపక్కలే ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 14
వృషభం: మీ పరిమితుల గోడలను విచ్ఛిన్నం చేసేందుకు మీ ఆందోళనలు, అనిశ్చితులను పక్కన పెట్టాలి. కొత్త విషయాలు ప్రయత్నించండి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 14
మిధునం: ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి మారండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండండి. ఆరోగ్యకరమైన శరీరం నిజంగా ఒక గొప్ప వరం. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 14
కర్కాటకం: మీలో గొప్ప లక్షణాలు, చెడ్డ లక్షణాలు గుర్తించి వాటిని వేరు చేయండి. 2022లో పరివర్తన లేదా మార్పు చోటుచేసుకుంటుంది. ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 14
సింహం: సహనంగా వ్యవహరించండి, ఈ కొత్త సంవత్సరంలో మీ పనికి తగిన ప్రతిఫలాన్ని తక్షణమే ఆశించకండి. మీ దారిన మీరు వెళ్లడమే మీకు కావాలి. కాబట్టి భయపడకండి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 14
కన్య: మీరు ప్రేమగా చూసుకునేవారితో తగిన సమయం గడపండి. ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. మిమ్మల్ని పట్టించుకోని వారితో స్నేహాన్ని విడిచిపెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 14
తుల: ఈ సంవత్సరం మీరు పూర్తి చేయాలానే వాటి జాబితా రూపొందించండి. సమయాన్ని వృథా చేయకండి. గడిచిన రెండు సంవత్సరాల కంటే ఇది భిన్నంగా ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 14
వృశ్చికం: కపట స్నేహితులు, కుటుంబాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగానే పెట్టండి. వీళ్ల వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 14
ధనుస్సు: ఈ సంవత్సరం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. దుబారా ఖర్చులు చేయకండి. ఖర్చుకు తగిన ప్రణాళిక రూపొందించండి. డబ్బు పొదుపు చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 14
మకరం: సోషల్ మీడియాలో అధిక సమయం గడపకండి. పనులు సక్రమంగా చేయండి. మీ చదువులు లేదా ఉద్యోగంపై దృష్టి నిలపండి. లక్ష్యంపై మీరు దృష్టి సారిస్తే దాన్ని సాధించకుండా ఆపడం ఎవరి తరమూ కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 14
కుంభం: రోజంతా పనిలో, ఇంట్లో ఉండకండి. విరామం తీసుకోండి. కొత్తగా ఏదైనా ప్రయత్నించండి. మీ కంఫర్ట్ జోన్నుంచి బయటకు వచ్చి కొత్త పనులు, కొత్త ఆలోచనలను స్వాగతించండి. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 14
మీనం: ప్రేమించే వ్యక్తులతో చక్కని సమయం గడిపే అవకాశాన్ని వదులుకోకండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుటుంబం, ప్రేమించే వ్యక్తులతో సమయం గడపండి. (ప్రతీకాత్మక చిత్రం)