Horoscope today: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. ఇవి ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... వారి రాశి ఫలాలపై మంచి, చెడు ఫలితాలు ప్రభావం చూపుతాయి. మంచి జరిగే అవకాశం ఉంటే... ఆనందమే. అదే చెడు జరిగే అవకాశం ఉంటే... అప్రమత్తం అవ్వాలి. మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో అలర్ట్గా ఉండాలి. అలా మనల్ని అప్రమత్తం చెయ్యడంలో రాశిఫలాలు ఉపయోగపడతాయి. మరి 12-11-2021 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో చూడండి.
వృషభం (కృత్తిక 2,3,4,రోహిణి, మృగశిర 1,2) ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మీద శ్రద్ధ పెంచాలి. గ్రహబలం తక్కువగా ఉంది. ఉద్యోగంలో నిలకడ ఉంది. కొన్ని కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆదాయం పరవాలేదు. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుస్తారు. శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొందరికి మీ వల్ల ఆర్థికంగా మేలు జరుగుతుంది. నచ్చినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆశించిన స్థాయిలో గ్రహ బలం లేనప్పటికీ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లోతుగా ఆలోచించి, కుటుంబ సభ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇతరుల మాటలు ఏమాత్రం పట్టించుకోవద్దు.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో పురోగతి కనిపిస్తోంది. ఆదాయానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. అనుకున్న పనులు తేలికగా నెరవేరుతాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. అదృష్ట యోగం ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యల పరిష్కారానికి సొంత నిర్ణయాలు మంచివి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనుల్ని ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు, సన్నిహితుల సలహాలు కూడా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి. ఆశయ సాధనకు బాగా కృషి చేస్తారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి, అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గృహ సౌఖ్యం ఉంది. వాహన యోగం కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.